(K. Veeranna, News18, Medak)
కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కాంగ్రెస్లో కొత్త ఉత్సాహం వస్తుంది . మొట్టమొదటిగా ఇంద్రవెల్లి సభ రెండు లక్షల మందితో సక్సెస్ఫుల్ చేసిన రేవంత్ రెడ్డి... రెండో సభ మహేశ్వరం నియోజకవర్గం లో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా కాంగ్రెస్ సభ సక్సెస్ కావడంతో మూడో సభ సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న మేడ్చల్ జిల్లా 3 చింతల పల్లి గ్రామంలో రెండు రోజుల పాటు దీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి ఆ దీక్షలో యూత్ తో పాటు కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం తో ఆ సభ ద్వారా నాలుగో సభ గజ్వేల్ నియోజకవర్గంలో రేపు దళిత దండోరా సభ ఏర్పాటు చేశారు.
అధికార పార్టీ నేతలు అడ్డుకోవడానికి వస్తే వారిని తొక్కుకుంటూ నైనా వెళ్తానని రేవంత్రెడ్డి చెప్పడంతో యూత్ లో మరింత ఉత్సాహం పెరిగింది. ఈ ఉత్సాహంతో ఈ దళిత దండోరా సభను పూర్తి బాధ్యతలను మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అప్పజెప్పారు రేవంత్ రెడ్డి.
రేపు జరిగే గజ్వేల్ దళిత దండోరా ఆత్మీయ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చే విధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పది నియోజకవర్గాల నుండి ఒక్కొక్క నియోజకవర్గం నుండి పదివేల మంది చొప్పున దళిత దండోరా సభకు కాంగ్రెస్ కార్యకర్తలు యూత్ నాయకులు తరలి రావడానికి కాంగ్రెస్ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దళిత దండోరా ఆత్మీయ సభకు ను ఇంద్రవెల్లి సభ కంటే భారీ ఎక్కువ మంది కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చే విధంగా నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.మరో పక్క కాంగ్రెస్ లోనే రెండు వర్గాల విడిపోయి యూత్ కాంగ్రెస్.. మరోపక్క కాంగ్రెస్ పోటాపోటీ ఫ్లెక్సీలు సిద్ధం చేస్తామన్నారు.
పోలీసులు అనుమతి ఇచ్చినప్పటికీ దళిత దండోరా ఆత్మీయ సభకు మూడు గంటల నుండి 8 గంటల వరకు దళిత దండాలు సభకు అనుమతి ఇచ్చారు. కాంగ్రెస్ శ్రేణులు ములుగు మండలం వంటిమామిడి నుండి సభా స్థలం వరకు బైక్ ర్యాలీ తీయడానికి ప్రయత్నాలు చేసినా.. దానికి పోలీసులు మాత్రం అనుమతి ఇవ్వలేదు. ప్రజ్ఞాపూర్ సభ స్థలం వరకే బైక్ ర్యాలీ కి పోలీసులు అనుమతించారు.
దళిత దండోరా ఆత్మీయ సభకు వ్యతిరేకంగా ఉన్నవారు ఈ సభకు వెళ్లవద్దని అధికార పార్టీ నేతలు చెబుతున్నట్లు విశ్వనీయ సమాచారం. మరోపక్క కాంగ్రెస్ నాయకులు పై ఉన్న కేసులను కొట్టి వేస్తామని కాంగ్రెస్ నేతలకు సీక్రెట్ గా పోలీస్ స్టేషన్కు పిలిపించుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో అధికార పార్టీ టీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫోన్ చేసి ఇదే విషయం చెబుతున్నట్లు తెలుస్తోంది.
పేదరికంలోకి నెట్టిన ఘనత కేసీఆర్ దే..
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో రేపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సభ స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏడు సంవత్సరాల నుండి రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గజ్వేల్ లో సభ సాక్షిగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాలన్నారు. గత ఏడు సంవత్సరాల నుండి దళిత గిరిజన ఆదివాసిల సంక్షేమం కోసం ఏలాంటి పథకాలను అమలు చేయలేక పోయారని.. అంతే కాకుండా ప్రజలను పేదరికంలోకి నెట్టేశాడని ఆరోపించారు. దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర సభలు నిర్వహించిన తర్వాతనే ప్రగతి భవన్ లో కి దళిత అధికారులకి ప్రవేశం దొరికింది. అదేవిధంగా దళితులకు పది లక్షల సహాయం చేస్తాను అని ఒప్పుకున్న మీకు.. నిజంగా చిత్తశుద్ధి ఉంటే దళితులకు 3 ఎకరాల భూమి డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వాలన్నారు. అంతే కాకుండా.. ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ఇవన్ని చేయడం చేతగాకనే దళితులను మభ్యపెట్టేందుకు ఇదంతా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పూర్వం కాంగ్రెస్ పార్టీ ఇతరుల చేతిలో ఉన్నటువంటి భూములను పేద ప్రజలకు పంచిందని.. వారి సంక్షేమానికి పాటుపడిందన్నారు. కానీ ఈరోజు మీరు అధికారంలోకి వచ్చాక దళితుల భూములను గుంజుకున్నారన్నారు. ఈ గజ్వేల్ గడ్డ మీద నుండి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా దళిత గిరిజన ఆదివాసి లే కాకుండా ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వ విధానాల వ్యతిరేక బీసీ బిడ్డలు కూడా పాల్గొని సభను పెద్ద సంఖ్యలో విజయవంతం చేయాలని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gajwel, Medak, Telangana, Telangana Politics