హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

స్కూల్ పిల్లలు కూడా సిగ్గుపడతారు.. మీరిక మారరా? : బీజేపీ ఎంపీలకు PM Modi సీరియర్ వార్నింగ్

స్కూల్ పిల్లలు కూడా సిగ్గుపడతారు.. మీరిక మారరా? : బీజేపీ ఎంపీలకు PM Modi సీరియర్ వార్నింగ్

బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలకు పీఎం మోదీ క్లాస్

బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలకు పీఎం మోదీ క్లాస్

’మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కానట్లుంది. మీరింకా మారరా? లేదూ, మేం ఇలాగే వ్యవహరిస్తామంటారా? అయితే సిద్ధంగా ఉండండి.. అవసరమైన మార్పులు వాటంతట అవే జరిగిపోతాయి మరి..’ అంటూ బీజేపీ ఎంపీలకు సీరియర్ వార్నింగ్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బీజేపీ ఎంపీల హాజరు శాతం పడిపోవడంపై ఆయనిలా ఫైరయ్యారు..

ఇంకా చదవండి ...

‘స్కూలుకు వెళ్లే పిల్లలు కూడా పదే పదే చెప్పించుకోడానికి ఇష్టపడరు. అలాంటిది బాధ్యతగల పదవుల్లో ఉన్న మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కానట్లుంది. మీరింకా మారరా? లేదూ, మేం ఇలాగే వ్యవహరిస్తామంటారా? అయితే సిద్ధంగా ఉండండి.. అవసరమైన మార్పులు వాటంతట అవే జరిగిపోతాయి మరి..’ అంటూ బీజేపీ ఎంపీలకు సీరియర్ వార్నింగ్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బీజేపీ ఎంపీల హాజరు శాతం పడిపోవడం, ప్రొసీడింగ్స్ జరుగుతోన్న సమయంలో ఎంపీలు గైర్మాజరవుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలు పరివర్తన చెందాలంటూ ఈ మేరకు ప్రధాని హితవుపలికారు.

ఢిల్లీ జన్ పథ్ రోడ్డులోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో మంగళవారం నాడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సభ జరుగుతోన్న సమయంలో బీజేపీపీపీ భేటీ పార్లమెంట్ వెలుపల జరగడం చరిత్రలో ఇదే తొలిసారి. ప్రస్తుత పార్లమెంట్ భవనంలో రిపేర్ల నిమిత్తం లైబ్రరీ హాలును మూసివేయడంతో అధికార పార్టీ ఇలా తొలిసారి బయటి వేదికపై పార్టీ ఎంపీల సమావేశం నిర్వహించింది. ప్రధాని మోదీ కీలక ఉపన్యాసం చేసిన ఈ భేటీలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతోపాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, ప్రహ్లాద్ జోషి, పియూష్ గోయల్, జైశంకర్ తదితరులు, ఉభయ సభల్లోని బీజేపీ ఎంపీలు హాజరయ్యారు.

నవంబర్ 15ను ‘జన జాతీయ గౌరవ దినోత్సవం’గా ప్రకటించినందుకుగానూ బీజేపీ గిరిజన ఎంపీలు ప్రధాని మోదీని సన్మానిస్తోన్న దృశ్యం

etela rajenderపై ప్రతీకారం.. టీఆర్ఎస్‌ క్లర్కుగా కలెక్టర్ హరీశ్.. cm kcrపైనా జమున ఫైర్పార్లమెంట్ సమావేశాలకు గైర్జాజరు కావొద్దని, ప్రొసీడింగ్స్ జరుగుతున్న సమయంలో సభలోనే ఉండాలని తీవ్ర స్వరంతో ప్రధాని మోదీ బీజేపీ ఎంపీలను హెచ్చరించారు. అదే సమయంలో.. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యాన్ని ప్రస్తావించకుండానే ప్రజారోగ్యంపై బీజేపీ ఎంపీలు ఫోకస్ పెట్టాలని మోదీ సూచించారు. ఎంపీలకు క్రీడాపోటీల అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ప్రతిరోజూ సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యానికి కలిగే మేలును ఎంపీలకు వివరించారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మాట్లాడుతూ పార్టీ ఎంపీల ఆధ్వర్యంలో కిసాన్ సమ్మేళనాలు జరపాలని సూచించారు.

Omicron : ఒమిక్రాన్ వల్ల భారత్‌లో కరోనా మూడో వేవ్ -రోజుకు 1.5లక్షల కేసులు రాబోతున్నాయ్ : సైంటిస్టుల వార్నింగ్బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో గిరిజన ఎంపీలు పలువురు ప్రధాని మోదీని సత్కరించారు. బిర్సా ముండా జయంతి అయిన నవంబర్ 15ను ‘జన జాతీయ గౌరవ దినోత్సవం’గా ప్రకటించినందుకుగానూ ఎంపీలు మోదీని సన్మానించారు. బ్రిటిష్‌ వలసవాదం, దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించిన గిరిజన యోధుడు బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల స్మారకార్థం నవంబర్‌ 15వ తేదీని జన జాతీయ గౌరవ్‌ దివస్‌గా కేంద్రం ఇటీవలే ప్రకటించడం తెలిసిందే.

Published by:Madhu Kota
First published:

Tags: Bjp, Parliament Winter session, Pm modi

ఉత్తమ కథలు