హోమ్ /వార్తలు /జాతీయం /

100 సార్లు స్నానం చేసినా.. బర్రె లాగే కనిపిస్తావు : కుమారస్వామిపై బీజేపీ నేత విమర్శలు

100 సార్లు స్నానం చేసినా.. బర్రె లాగే కనిపిస్తావు : కుమారస్వామిపై బీజేపీ నేత విమర్శలు

కర్ణాటక ముఖ్యమంత్రి కుామరస్వామి ( ఫైల్ ఫోటో)

కర్ణాటక ముఖ్యమంత్రి కుామరస్వామి ( ఫైల్ ఫోటో)

బహిరంగ సభలు, మీడియా సమావేశాలకు వచ్చే ముందు మోదీ వాక్సింగ్‌తో మేకప్ చేసుకుని వస్తారని కుమారస్వామి కొద్దిరోజుల క్రితం విమర్శించారు. అందుకే ఆయన ముఖం మెరుస్తూ ఉంటుందన్నారు.

    కెమెరా ముందుకు రావాలంటే ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకమైన మేకప్‌‌తో వస్తారని కర్ణాటక సీఎం కుమారస్వామి ఇటీవల విమర్శించిన సంగతి తెలిసిందే. ఆ మేకప్ కారణంగానే ఆయన ముఖం తళుక్కున మెరుస్తుంటుందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో కుమారస్వామి వ్యాఖ్యలపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజు కగే ఘాటుగా స్పందించారు. కుమారస్వామి రోజుకు 100 సార్లు స్నానం చేసినా.. బర్రె లాగే కనిపిస్తారని ఎద్దేవా చేశారు.


    నరేంద్ర మోదీ రోజుకు 10సార్లు పౌడర్ రాసుకుంటారని, 10 డ్రెస్సులు మారుస్తారని కుమారస్వామి విమర్శిస్తున్నారు. నిజానికి మోదీ తెల్లగా, అందంగా ఉంటారు. ఆయనకు మేకప్‌తో పనిలేదు. కానీ నువ్వు మాత్రం రోజుకు 100 సార్లు స్నానం చేసినా బర్రె లాగే కనిపిస్తావు.
    రాజు కగె, బీజేపీ మాజీ ఎమ్మెల్యే


    బహిరంగ సభలు, మీడియా సమావేశాలకు వచ్చే ముందు మోదీ వాక్సింగ్‌తో మేకప్ చేసుకుని వస్తారని కుమారస్వామి కొద్దిరోజుల క్రితం విమర్శించారు. అందుకే ఆయన ముఖం మెరుస్తూ ఉంటుందన్నారు. అదే మన విషయం తీసుకుంటే.. ఈరోజు స్నానం చేసి బయటకెళ్లామంటే.. మళ్లీ మరుసటి రోజే స్నానం చేసి ముఖం కడుక్కుంటాం అన్నారు. అందుకే మన ముఖాలు అంత బాగా కనిపించవని.. కాబట్టే మీడియా మోదీని తప్ప మనల్ని చూపించడం లేదని విమర్శించారు.

    First published:

    Tags: Bjp, Karnataka Lok Sabha Elections 2019, Karnataka Politics, Kumaraswamy, Narendra modi

    ఉత్తమ కథలు