హోమ్ /వార్తలు /national /

టీడీపీలో విషాదం.. కీలక నేత బడేటి బుజ్జి కన్నుమూత..

టీడీపీలో విషాదం.. కీలక నేత బడేటి బుజ్జి కన్నుమూత..

బడేటి బుజ్జి (Image : Twitter)

బడేటి బుజ్జి (Image : Twitter)

టీడీపీ సీనియర్ నేత, ఏలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి(55) కన్నుమూశారు.

  టీడీపీ సీనియర్ నేత, ఏలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి(55) కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున

  2.30గం.-3గం. ప్రాంతంలో ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటిన ఏలూరులోని ఆంధ్రా ఆసుపత్రికి

  తరలించారు. అయితే అప్పటికే బుజ్జి మృతి చెందినట్టు వైద్యులు నిర్దారించడంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆసుపత్రి నుంచి ఆయన మృతదేహాన్ని ఏలూరులోని నివాసానికి తరలించారు. బుజ్జి మరణవార్త తెలియగానే టీడీపీ శ్రేణులు,అభిమానులు ఆయన ఇంటికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. బుజ్జి మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుజ్జి కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించి ఓదార్చారు.

  కాగా, బుజ్జి అసలు పేరు బడేటి కోట రామారావు. దివంగత సినీ నటుడు ఎస్వీ రంగారావుకు బుజ్జి మేనల్లుడు. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీతో 2004లో బుజ్జి రాజకీయ తెరంగేట్రం చేశారు. అప్పటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మున్సిపల్ కౌన్సిలర్‌గా, ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. 20014లో టీడీపీ తరుపున గెలిచి ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. బుజ్జికి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు.

  Published by:Srinivas Mittapalli
  First published:

  Tags: Eluru, TDP

  ఉత్తమ కథలు