హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ఆ రోజే ఎన్నికలు..

Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ఆ రోజే ఎన్నికలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rajya Sabha Elections: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 15 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 57 రాజ్యసభ స్థానాల భర్తీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.

  త్వరలోనే ఖాళీ కాబోతున్న 57 రాజ్యసభ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ (Telangana) సహా 15 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 57 రాజ్యసభ స్థానాల భర్తీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 24న వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. జూన్ 1న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 3వరకు గడువు విధించారు. ఎన్నికలు జూన్ 10న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ జరుగుతుంది. 15 రాష్ట్రాల్లోని 57 రాజ్యసభ (Rajya Sabha) స్థానాలకు జూన్ 10న ఎన్నికలు జరగనున్నాయి. గరిష్టంగా 11 స్థానాలు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయి. దాని తర్వాత మహారాష్ట్ర, తమిళనాడు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో చెరో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

  ఆంధ్రప్రదేశ్,(Andhra Pradesh) తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కర్నాటక, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్ మరియు హర్యానా వంటి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. గత నెలలో జరిగిన ఎన్నికల తరువాత పార్లమెంటు ఎగువ సభలో బీజేపీ బలం 100 మార్కును దాటగలిగింది.

  1990 తర్వాత ఈ రికార్డ్ సొంతం చేసుకున్న మొదటి పార్టీగా బీజేపీ అవతరించింది. ఆ పార్టీ మరో మూడు సీట్లు గెలుచుకుంది. అస్సాం, త్రిపుర, నాగాలాండ్ నుండి ఒక్కొక్క సీటు గెలుచుకుని ఎగువ సభలో తన బలాన్ని 101కి పెంచుకుంది. రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉండగా, మెజారిటీ మార్క్ 123గా ఉంది.

  Rajiv Kumar | CEC : నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్.. 14న ప్రదీప్ చంద్ర రిటైర్

  Taj Mahal: తాజ్ మహల్ గదులను తెరిపించాలన్న పిల్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

  ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి నాలుగు, తెలంగాణ నుంచి రెండు సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. ఏపీ నుంచి ఎంపీలు విజయసాయిరెడ్డి, సురేష్ ప్రభు, టీజీ వెంకటేష్, సుజనా చౌదరిల పదవీకాలం ముగియనుంది. అలాగే తెలంగాణ నుంచి కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, ధర్మపురి శ్రీనివాస్‌లు రిటైర్‌ అవుతున్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Rajya Sabha

  ఉత్తమ కథలు