ప్రధాని నరేంద్ర మోదీపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారం ముగిసిపోయినా.. కేదార్‌నాథ్ యాత్రను మోదీ పరోక్షంగా అందుకోసం వాడుకున్నారని తృణమూల్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఓటర్లను ప్రభావితం చేయడానికే ఆయన కేదార్‌నాథ్ యాత్ర చేపట్టారని ఆరోపించింది.యాత్రకు మీడియా పూర్తి కవరేజ్ ఇచ్చిందని.. ఇది ఎన్నికల నియామవళిని ఉల్లంఘించడమేనని ఫిర్యాదులో పేర్కొంది.
తుది దశ పోలింగ్‌లో ఓటర్లను ప్రభావితం చేసేందుకే మోదీ కేదార్‌నాథ్, బద్రినాథ్ యాత్ర చేపట్టారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దురదృష్టవశాత్తు ఈసీ వీటన్నింటని చూసీ చూడనట్టు వదిలేస్తోందని విచారం వ్యక్తం చేస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kedarnath, Lok Sabha Elections 2019, Mamata Banerjee, Narendra modi, West Bengal