Home /News /national /

POLITICS EKNATH SHINDE VISITS KAMAKHYA TEMPLE TO RETURN TO MUMBAI TOMORROW WITH OTHER SHIV SENA MLAS PVN

Eknath Shinde : అమ్మా..నువ్వే దిక్కు : ముంబైలో అడుగుపెట్టే ముందు శక్తిపీఠాన్ని సందర్శించిన ఏక్ నాథ్ షిండే

కామాఖ్య ఆలయంల షిండే పూజలు

కామాఖ్య ఆలయంల షిండే పూజలు

Eknath Shinde Visits Kamakhya Temple : సీఎం ఉద్ద‌వ్ త‌న బ‌లాన్ని రేప‌టి సాయంత్రంలోగా నిరూపించుకోవాల‌ని గ‌వ‌ర్న‌ర్ కోశియారి ఆదేశించిన నేప‌థ్యంలో ఆ ఫ్లోర్ టెస్ట్‌కు హాజ‌రుకానున్న‌ట్లు షిండే తెలిపారు. రేపు ఉదయం రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి షిండే ముంబై చేరుకోనున్నారని సమాచారం.

ఇంకా చదవండి ...
Eknath Shinde Visits Kamakhya Temple: మహారాష్ట్రలో కొద్దిరోజులుగా కొనసాగుతోన్న రాజకీయ సంక్షోభం (Maharashtra Crisis) తుది దశకు చేరింది. శివసేన పార్టీలో ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో ఎమ్మెల్యేల తిరుగుబాటు వల్ల మైనార్టీలో పడిపోయిన సంకీర్ణ సర్కారుకు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ కీలక ఆదేశాలిచ్చారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ కోరారు. గురువారం (రేపు) సాయంత్రమే మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని, ప్రక్రియ మొత్తాన్నీ వీడియోలో రికార్డు చేయాలనీ గవర్నర్ నిర్దేశించారు. ఉద్ధవ్ ఠాక్రే సర్కారు బలపరీక్షకు ఆదేశించాల్సిందిగా బీజేపీ పక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ లేఖ ఇచ్చిన కొద్ది గంటలకే గవర్నర్ కోశ్యారీ ఆ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గురువారం ఉదయం 11 గంటలకు సమావేశమయ్యే ఏకైక అజెండా ఫ్లోర్ టెస్ట్ అని గవర్నర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి కారణమైన ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde)నేతృత్వంలోని శివసేన రెబల్ ఎమ్మెల్యేలు..గత వారం రోజుల నుంచి అసోం(Assam)లోని గౌహతిలో బ‌స చేస్తున్న విష‌యం తెలిసిందే. వారం నుంచి హోట‌ల్‌లోనే ఉన్న ఏక్‌నాథ్ షిండే బృందం ఇవాళ ఉద‌యం కామాఖ్య(Kamakya Temple)అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. గౌహ‌తిలో ఉన్న శ‌క్తిపీఠం కామాఖ్య దేవి ఆలయంలో ఏక్‌నాథ్ షిండే పూజ‌లు నిర్వ‌హించారు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు గౌహతి చేరుకున్నప్పటి నుంచి వారితోనే ఉంటున్న అసోం బీజేపీ ఎమ్మెల్యే సుశాంత బోర్గోహెయిన్, ఇద్దరు శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండే కలిసి ఆలయానికి వచ్చారు.



PHOTOS : ఛీ..ఛీ,నువ్వసలు ఆడదానివేనా : లంచం తీసుకుని అత్యాచార నిందితులను కాపాడుతున్న మహిళా పోలీస్

మ‌హారాష్ట్ర ప్ర‌జ‌ల త‌ర‌పున కామాఖ్య‌కు పూజ‌లు చేసిన‌ట్లు ఏక్‌నాథ్ తెలిపారు. ఇవాళ సాయంత్రం వ‌ర‌కు గౌహ‌తిలో ఉన్న శివ‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యేలు ముంబైకు చేరుకునే అవ‌కాశాలు ఉన్నాయి. మ‌హారాష్ట్ర‌లో రేపు జ‌రిగే బ‌ల‌ప‌రీక్ష‌కు తాను హాజ‌రుకానున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. సీఎం ఉద్ద‌వ్ త‌న బ‌లాన్ని రేప‌టి సాయంత్రంలోగా నిరూపించుకోవాల‌ని గ‌వ‌ర్న‌ర్ కోశియారి ఆదేశించిన నేప‌థ్యంలో ఆ ఫ్లోర్ టెస్ట్‌కు హాజ‌రుకానున్న‌ట్లు షిండే తెలిపారు. రేపు ఉదయం రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి షిండే ముంబై చేరుకోనున్నారని సమాచారం. మరికాసేపట్లో గోవాకు చేరుకోనున్న ఎమ్మెల్యేలు.. కలిసికట్టుగానే రేపు అక్కడినుంచి ముంబైకి విమానంలో వచ్చి అసెంబ్లీకి హాజరవుతారని తెలుస్తోంది. మహా వికాస్‌ ఆఘాడీ(ఎంవీఏ) కూటమిలో భాగంగా.. కాంగ్రెస్‌, ఎన్‌సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన శివసేనకు 55 స్థానాలు ఉండగా.. ప్రస్తుతం ఏక్‌నాథ్‌ షిండే వర్గంలో 39 మంది ఎమ్మెల్యేలున్నారు. స్వతంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు మరో 10 మంది కూడా ఆయన శిబిరంలో చేరారు. మెజార్టీ కోల్పోయిన ఉద్ధవ్‌ సర్కారు ఏ క్షణంలోనైనా పతనం అయ్యే పరిస్థితులు ఉన్నాయి.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Eknath Shinde, Maharashtra, Maharashtra Governor Bhagat Singh Koshyari, Shiv Sena, Uddhav Thackeray

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు