హోమ్ /వార్తలు /జాతీయం /

Karnataka Crisis | రెబల్ ఎమ్మెల్యేలకు షాకిచ్చిన స్పీకర్

Karnataka Crisis | రెబల్ ఎమ్మెల్యేలకు షాకిచ్చిన స్పీకర్

కర్ణాటక స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్

కర్ణాటక స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్

11 మంది రాజీనామాల్లో ఎనిమిది లేఖలు నిర్దేశిత ఫార్మాట్‌లో లేవని స్పష్టం చేశారు. ఆ మిగిలిన లేఖలకు సంబంధించి తాను పూర్తిగా అధ్యయనం చేయాలని స్పీకర్ రమేష్ కుమార్ చెప్పారు.

  కర్ణాటకలో రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ షాకిచ్చారు. రాజీనామా చేసిన వారిలో 11 మంది సభ్యులు స్పీకర్‌ను కలిశారు. ఆ తర్వాత ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. 11 మంది రాజీనామాల్లో ఎనిమిది లేఖలు నిర్దేశిత ఫార్మాట్‌లో లేవని స్పష్టం చేశారు. ఆ మిగిలిన లేఖలకు సంబంధించి తాను పూర్తిగా అధ్యయనం చేయాలని, ఎమ్మెల్యేలను కలిసి.. వారు మనస్ఫూర్తిగా రాజీనామా చేశారా? లేదా తెలుసుకోవాల్సి ఉందన్నారు. వారు ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వతంత్రంగా, మనస్ఫూర్తిగా రాజీనామా చేసినట్టు తాను కన్విన్స్ అయితే, అప్పుడు వారి రాజీనామాలను ఆమోదిస్తానని చెప్పారు. తాను రాజ్యాంగం ప్రకారం, ప్రజల అభీష్టం ప్రకారం నడుచుకుంటానని స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో స్పీకర్ తాత్సారం చేస్తున్నారంటూ వచ్చిన వార్తలు తనను చాలా బాధించాయని స్పీకర్ రమేష్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యేలు తనను కలిసేందుకు ముందుగా ఎలాంటి అపాయింట్‌మెంట్ తీసుకోలేదన్నారు. ఆరో తేదీ మధ్యాహ్నం 1.30 వరకు తాను ఆఫీసులోనే ఉన్నానని.. ఆ తర్వాత తన వ్యక్తిగత పనుల వల్ల బయటకు వెళ్లానన్నారు. అంతే కానీ, తాను ఎక్కడికీ పారిపోలేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు తనకు చెప్పకుండా గవర్నర్ వద్దకు వెళ్లారని రమేష్ కుమార్ ఆరోపించారు.

  ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు తనకు సూచించిందన్న స్పీకర్.. రెబల్ ఎమ్మెల్యేలతో మాట్లాడిన అంశాలను తాను వీడియో తీయించామని.. వాటిని సుప్రీంకోర్టుకు అందజేస్తామన్నారు. కొందరు తమను బెదిరించడం వల్లే తాము ముంబై వెళ్లినట్టు చెప్పారని స్పీకర్ రమేష్ కుమార్ తెలిపారు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు తనకు చెప్పి ఉంటే వారికి భద్రత కల్పించి ఉండే వాడినని స్పీకర్ అన్నారు. కేవలం మూడు పనిదినాలు ఆలస్యం అయినందుకే.. అదేదో భూకంపం వచ్చినట్టుగా ప్రవర్తించారని రెబల్ ఎమ్మెల్యేల మీద అసంతృప్తి వ్యక్తం చేశారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Bjp, Congress, Jds, Karnataka political crisis

  ఉత్తమ కథలు