హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Sadhvi Ritambhara: ఒక్కో హిందూ జంట 4పిల్లల్ని కనాలి.. ఇద్దరిని సంఘ్‌కు ఇచ్చేయాలి!

Sadhvi Ritambhara: ఒక్కో హిందూ జంట 4పిల్లల్ని కనాలి.. ఇద్దరిని సంఘ్‌కు ఇచ్చేయాలి!

సాధ్వి రితంబర (పాత ఫొటో)

సాధ్వి రితంబర (పాత ఫొటో)

స్వయంగా సన్యాసిని అయిన సాధ్వి రితంబ‌ర దేశంలోని సంసారులను ఉద్దేశించి, మత ఘర్షణలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక్కో హిందూ జంట న‌లుగురు పిల్లల్ని కని, అందులో ఇద్ద‌రిని జాతి కోసం కేటాయించాల‌ని పిలుపునిచ్చారు.

దేశంలో మతసామర్యం దెబ్బతినేలా అతివాద సంస్థలు, కొన్ని రాజకీయ పార్టీలు తీవ్ర చర్యలకు ఒడిగడుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతోన్న వేళ.. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో శ్రీరామ నవమి తర్వాత మత ఘర్షణలు నిత్యకృత్యంగా మారిన సమయాన ఉద్రిక్తతలకు మరింత ఆజ్యంపోస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సాధ్వి రితంబర. స్వయంగా సన్యాసిని అయిన ఆమె.. దేశంలోని సంసారులను ఉద్దేశించి సంతానం విషయంలో పిలుపునిచ్చారిలా..

దేశంలో ఒక్కో హిందూ దంపతులు నలుగురు చొప్పున పిల్లలను కనాలని హిందూత్వ నేత, దుర్గా వాహిని వ్యవస్థాపకురాలు, వీహెచ్‌పీ మ‌హిళా విభాగం వ్య‌వ‌స్ధాప‌కురాలు సాధ్వి రితంబ‌ర పిలుపునిచ్చారు. హిందూ దంపతులు కనే నలుగురు పిల్లల్లో ఇద్దరిని కచ్చితంగా ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ లేదా వీహెచ్‌పీ లాంటి సంఘ్ సంస్థలకు ఇచ్చేయాలని చెప్పారు. అలా చేస్తే భారత్ త్వరలోనే హిందూత్వ రాజ్యంగా అవతరిస్తుందన్నారు.

CM KCR : కేసీఆర్‌కు భారీ షాక్.. గులాబీ బాస్ బీజేపీ వ్యతిరేకి కాదా! -ఫెడరల్ ఫ్రంట్ ఫసక్?


ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో గల నీరాల నగర్‌లో ఆదివారం జరిగిన రామ మహోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ సాధ్వి రితంబర ఈ వ్యాఖ్యలు చేశారు. తన ప్రసంగంలో ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతోన్న మత ఘర్షణలను కూడా ఆమె ప్రస్తావించారు. దేశ అభివృద్ధిని ఓర్వలేని కొంతమంది ఢిల్లీలోని జహంగిర్‌పురిలో శనివారం హనుమాన్‌ శోభాయాత్రపై దాడి చేశారని సాధ్వి ఆరోపించారు.

IMD Alert : బంగాళాఖాతంలో వాయుగుండం.. వచ్చే 5రోజులు డేంజర్.. భారీ వడగండ్ల వానలు


రాజకీయ ఉగ్రవాదం ద్వారా హిందూ సమాజాన్ని విభజించాలని చూస్తున్న వారిని మట్టికరిపిస్తామని సాధ్వి రితంబర హెచ్చరించారు. ఈ సందర్భంగా హిందువుల జనాభా పెరగాలనే ఉద్దేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ మ‌హిళ‌లు మేమిద్ద‌రం..మాకిద్ద‌ర‌నే నినాదాన్ని అనుసరిస్తార‌ని, అయితే హిందూ జంటలు న‌లుగురు పిల్లల్ని కని, అందులో ఇద్ద‌రిని జాతి కోసం కేటాయించాల‌ని, హిందూ జంట‌లు వారి పిల్ల‌ల‌ను ఆర్ఎస్ఎస్‌, భజరంగ్ దళ్, వీహెచ్‌పీల‌కు అప్ప‌గించాల‌ని రితంబర అన్నారు. ఈ సాధ్వి గతంలో బాబ్రి మసీదు కూల్చివేత కేసు, ముస్లింలపై యుద్దం ప్రకటించిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులను ఎదుర్కొన్నారు.

Published by:Madhu Kota
First published:

Tags: Delhi, Hindu community leaders, RSS, Uttar pradesh, VHP

ఉత్తమ కథలు