వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు రసవత్తరగా మారాయి. అధికార పార్టీ అన్నాడీఎంకేలో సంక్షోభానికి తెరపడింది. మొన్నటి వరకు నువ్వా...నేనా అన్నట్లుగా పోటీపడిన పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఇప్పుడు చేతులు కలిపారు. పార్టీ విజయమే లక్ష్యంగా కలిసి పనిచేయాలని నిర్ణయించారు. అంతేకాదు సీఎం అభ్యర్థిని కూడా ఖరారు చేశారు. అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిగా ప్రస్తుత సీఎం పళనిస్వామి పేరును పన్నీర్ సెల్వం ప్రకటించారు. 2021 ఎన్నికల కోసం 11 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు.
Edappadi K. Palaniswami will be AIADMK's CM Candidate for Tamil Nadu Assembly Election 2021: Tamil Nadu Deputy Chief Minister & AIADMK leader O Panneerselvam. pic.twitter.com/ViIwlMEixo
— ANI (@ANI) October 7, 2020
2016 డిసెంబరులో అప్పటి సీఎం జయలలిత అనారోగ్యంతో కన్నుమూశారు. జయలలిత మరణంతో అన్నాడీఎంకే రెండుగా చీలింది. పన్నీర్ సెల్వం, పళని స్వామి వర్గాలుగా విడిపోయింది. అనంతరం కొన్ని నెలల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు పన్నీర్ సెల్వం. ఆ తర్వాత నెలకొన్న రాజకీయ పరిణామాలతో పన్నీర్ సెల్వం సీఎం బాధ్యతల నుంచి తప్పుకున్నారు. సీఎంగా పళని స్వామి పగ్గాలు చేపట్టారు. కొన్నాళ్ల పాటు ఇరువురి మధ్య విభేదాలు కొనసాగాయి. ఆ తర్వాత రెండు వర్గాలు కలవడంతో శుభం కార్డు పడింది. సీఎంగా పళని, డిప్యూటీ సీఎంగా పన్నీర్ కొనసాగుతూ వచ్చారు.
ఐతే వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మళ్లీ ఇరువురి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో తాను సీఎంగా ఉంటానని పన్నీర్ చెప్పడంతో.. అందుకు పళని స్వామి అంగీకరించలేదు. కొన్ని రోజులుగా ఈ విషయమై పార్టీలో రచ్చ జరిగింది. ఎట్టకేలకు ఇవాళ జరిగిన చర్చల్లో OPS, EPS మధ్య సయోధ్య కుదరడంతో సీఎం అభ్యర్థిపై క్లారిటీ వచ్చింది. పళని స్వామిని సీఎం అభ్యర్థిగా స్వయంగా పన్నీర్ సెల్వం ప్రకటించారు. ఐతే పార్టీ అధ్యక్షుడిగా ఎవరుంటారన్న దానిపై కమిటీని ఏర్పాటు చేశారు. పళని సీఎంగా అభ్యర్థిగా ఉన్న నేపథ్యంలో.. పన్నీర్‌ను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశముంది.
AIADMK party has constituted a steering committee of 11 members for 2021 assembly elections in the state: Tamil Nadu Chief Minister & AIADMK leader Edappadi K Palaniswami https://t.co/190CyEiW1Q pic.twitter.com/JC5Ubw7g3j
— ANI (@ANI) October 7, 2020
తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2016లో జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే నుంచి 125 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. డీఎంకే నుంచి 97 మంది విజయం సాధించారు. కాంగ్రెస్ 7, ఐయూఎంఎల్ 1, ఎఎంఎంకే 1 సీటు సాధించాయి. ఐతే జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకoలో పెరిగిన వర్గ విభేదాలు, ప్రభుత్వ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోవాలని డీఎంకే భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న వ్యూహంతో ముందుకెళ్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AIADMK, Palanisami, Tamilnadu