హోమ్ /వార్తలు /national /

Dubbaka Bypolls: దుబ్బాకలో విజయశాంతి చిచ్చు, కాంగ్రెస్‌లో అసమ్మతి

Dubbaka Bypolls: దుబ్బాకలో విజయశాంతి చిచ్చు, కాంగ్రెస్‌లో అసమ్మతి

విజయశాంతి (ఫైల్ ఫోటో)

విజయశాంతి (ఫైల్ ఫోటో)

Vijayasanthi: దుబ్బాకలో విజయశాంతికి టికెట్ ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో హస్తం పార్టీలో టికెట్లు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న నలుగురు సీనియర్ నేతలు డోలాయమానంలో పడ్డారు.

  Telangana Congress on Dubbaka Bypolls: మెదక్ జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం విజయశాంతికి టికెట్ కేటాయిస్తున్నారని సమాచారంతో హస్తం పార్టీ స్థానిక రాజకీయ నాయకులకు నిరుత్సాహం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీలో జెండా మోసిన వారికి ఇవ్వకుండా విజయశాంతికి టికెట్ ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో హస్తం పార్టీలో టికెట్లు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న నలుగురు సీనియర్ నేతలు డోలాయమానంలో పడ్డారు. కోమటి రెడ్డి వెంకట నరసింహారెడ్డి, కర్ణం శ్రీనివాస్, మరో ఇద్దరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు దుబ్బాక ఉప ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విజయశాంతి బరిలోకి దింపుతుందనే ప్రచారంతో నలుగురు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ లో పని చేస్తారా, మరో పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయా? లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా? అనే అంశం తెరపైకి వస్తోంది. దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయశాంతికి టికెట్ ఇస్తే దుబ్బాక నియోజక వర్గంలో రాజకీయ సమీకరణాలు తారుమారు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు కోమటిరెడ్డి నరసింహా రెడ్డి. విజయశాంతికి టికెట్ ఖరారు చేస్తే ఆయన దారి ఎటువైపో చూడాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయశాంతిని బరిలో దింపితే, అధికార టీఆర్ఎస్ పార్టీ లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తుందని చెప్తున్నారు గులాబీ నాయకులు. దుబ్బాక నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఇప్పటికే అక్కడున్న ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, ఆ అంశం తమకు కలసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేస్తోంది.

  దుబ్బాక

  2018 డిసెంబర్‌లో జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దుల నాగేశ్వరరెడ్డి పోటీ చేశారు. రామలింగారెడ్డికి 89,299 ఓట్లు వచ్చాయి. నాగేశ్వరరెడ్డికి 26,799 ఓట్లు వచ్చాయి. 62,500 ఓట్ల తేడాతో రామలింగారెడ్డి విజయం సాధించారు. అయితే, కొన్ని రోజుల క్రితం రామలింగారెడ్డి హఠాన్మరణం చెందారు. దీంతో దుబ్బాకలో ఉప ఎన్నిక వచ్చింది. కాంగ్రెస్ పార్టీ బరిలో దిగుతామని చెప్పడంతో పోలింగ్ అనివార్యం అయింది.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Telangana, Tpcc, Vijayashanti

  ఉత్తమ కథలు