హోమ్ /వార్తలు /national /

Dubbaka ByPolls: దుబ్బాకలో ముగిసిన నామినేషన్ల గడువు, భారీగా అభ్యర్థులు

Dubbaka ByPolls: దుబ్బాకలో ముగిసిన నామినేషన్ల గడువు, భారీగా అభ్యర్థులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మొత్తం 46 నామినేషన్లు దాఖలయ్యాయి ఈనెల 17 తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 18, 19 తేదీలలో విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది.

  దుబ్బాక బై ఎలక్షన్లలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరిరోజు 34 మంది నామినేషన్ దాఖలు చేశారు గత నాలుగు రోజుల నుంచి జరుగుతున్న నామినేషన్లు చివరి రోజు కావడంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం 46 నామినేషన్లు దాఖలయ్యాయి ఈనెల 17 తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 18, 19 తేదీలలో విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థులు చాలా మంది నామినేషన్లను దాఖలు చేశారు. మొత్తం విత్ డ్రాలు పూర్తయ్యాక ఎంతమంది బరిలో ఉంటారనే విషయం తేలనుంది. 2018 సార్వత్రిక ఎన్నికల్లో 14 మంది బరిలో ఉండగా ఈసారి ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎక్కువగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. బై ఎలక్షన్లలో ప్రధాన పార్టీలు మూడు ఉన్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సోలిపేట రామలింగా రెడ్డి సతీమణి సుజాత, కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు బరిలో ఉన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ కత్తి కార్తీక పోటీ చేస్తున్నారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాలపై ప్రధాన పార్టీలు ఎక్కువ దృష్టి పెట్టాయి. ఈ ఉప ఎన్నికలలో భారీగా మద్యం డబ్బులు పంపిణీ చేయడానికి ప్రధాన పార్టీలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వాహనాల తనిఖీలో భాగంగా రూ.47.50 లక్షలు దొరికింది.

  మరోవైపు యాంకర్ కత్తి కార్తీకపై చీటింగ్ కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. భూ వివాదంలో సెటిల్‌మెంట్ చేస్తానంటూ మోసం చేసినట్టు కత్తి కార్తీకపై ఆరోపణలు వచ్చాయి. అమీన్‌పూర్ వద్ద 52 ఎకరాల భూమిని ఓ ప్రైవేటు కంపెనీకి ఇప్పించేందుకు మధ్యవర్తిత్వం చేసినట్టు బాధితుడు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. కార్తీక, అనుచరులు కోటి రూపాయలు డిపాజిట్ చేయించుకున్నారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం.

  దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో రేటర్నింగ్ అధికారి కార్యాలయంలో జరిగిన నామినేషన్ ప్రక్రియను ఉప ఎన్నికల సాధారణ పరిశీలకులు రాఘవ శర్మ పరిశీలించారు. ఈరోజు నామినేషన్లకు చివరి రోజు కావడంతో నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించే విధంగా అధికారులు చేసినటువంటి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ ప్రక్రియ ముగిసిన దృష్ట్యా అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అదే విధంగా శాంతి భద్రతలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తీరును, ఎన్నికల సిబ్బందికి శిక్షణ , ఎంసిఎంసి సెంటర్ లను ఆయన పరిశీలించారు. అదే విధంగా వెబ్ కాస్టింగ్ ఎన్నికల వ్యయ పర్యవేక్షణ తదితర అంశాలపై రిటర్నింగ్ అధికారి, సాధారణ అధికారి అడిగి తెలుసుకున్నారు. అనంతరం దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేటలో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్ ను, సీసీ కెమెరాలు, కరెంటు వినియోగం తదితర అంశాలపై సూచనలు చేశారు. అదే విధంగా గ్రామంలో ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు. దుబ్బాకలో నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 10న కౌంటింగ్ జరుగుతుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Telangana

  ఉత్తమ కథలు