హోమ్ /వార్తలు /national /

Dubbaka ByPolls: పరాయి నాయకులు, కిరాయి మనుషులు: బీజేపీపై హరీశ్ ఫైర్

Dubbaka ByPolls: పరాయి నాయకులు, కిరాయి మనుషులు: బీజేపీపై హరీశ్ ఫైర్

దుబ్బాకలో హరీశ్ రావు ఎన్నికల ప్రచారం

దుబ్బాకలో హరీశ్ రావు ఎన్నికల ప్రచారం

దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండలం మోతె గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత తరుపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

  దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ మీద విరుచుకుపడ్డారు మంత్రి హరీశ్ రావు. దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండలం మోతె గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత తరుపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు ప్రసంగించారు. ‘బీజేపీ వాళ్లు వంద కార్లేసుకుని ఊర్లలోకి వస్తున్నారు. ఊరోళ్లు వంద మంది కూడా ఉంటలేరు. పరాయి నాయకులు, కిరాయి మనుషులే వారికి దిక్కు. కాంగ్రెస్ టైం లో దొంగరాత్రి కరెంట్ వచ్చేది. టీఆర్ఎస్ చేసేది చెబుతుంది. చెప్పింది చేస్తున్నాం. అభివృద్ధిని కళ్లు ఉండీ చూడలేని గుడ్డి పార్టీలు కాంగ్రెస్, బీజేపీ లు. వాళ్ళు సీసాలను, పైసలను, అబద్ధాలను నమ్ముకున్నారు. వారి మాటలకు మోసపోతే గోసపడతం. లక్ష రూపాయల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తాం. అసెంబ్లీ ఆమోదం ఇప్పటికే తీసుకున్నాం. రుణమాఫీ ఇదివరకు బ్యాంకుల్లో జమ అయ్యేవి. ఈ సారి రుణమాఫీ చెక్కులను నేరుగా రైతులకే అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.’ అని హరీశ్ రావు అన్నారు. ఎక్కడెక్కడి నుంచో లీడర్లు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారని, ఎన్నికలయ్యాక వారెవరైనా ఇక్కడ ఉంటారా అని ప్రశ్నించారు. ‘రేవంత్ రెడ్డిని కొడంగల్ కు పోయి ఓడించినా. ఇది నా గడ్డ. వాళ్లొచ్చి ఏం చేస్తరు.’ అని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.

  దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారం లో బిజీ బిజీ గా ఉన్నారు. శనివారం ఉదయం తెల్లవారు జాము నుండే ప్రచారం ప్రారంభించి 5మండలాల్లో సుడి గాలి పర్యటన చేశారు. ఉదయం రాయ్ పోల్ మండలం ఎల్కల్ , బేగం పెట్ , వడ్డేపల్లి , రాం సాగర్ ,కొత్తపల్లి గ్రామాల్లో ఏన్నికల ప్రచారం నిర్వహించి, నార్సింగ్ మండలం లో రోడ్ షో , చేగుంట మండలం లోని కొండాపూర్ గ్రామంలో యువ గర్జన, దుబ్బాక లో పలువురి చేరుకలు, మిరుదొడ్డి మండలంలోని మోతె , కూడవెళ్లి , అక్బర్ పెట్, భూంపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు.

  ప్రచారానికి వెళ్లిన గ్రామాలతో పాటు, తొగుట మండలం ఏటీగడ్డ కిష్టాపూర్ గ్రామనికి చెందిన 30 మంది, దౌల్తాబాద్ మండలం ముబారస్ పూర్ గ్రామానికి చెందిన బీజేపీ యువకులు ,మిరుదొడ్డి మండలానికి చెందిన అల్వాల్, కొండాపూర్ , లింగుపల్లి గ్రామాల కు చెందిన యువకులు , పలు పార్టీ నేతలు టీఆర్ఎస్ పార్టీ లో జాయిన్ అయ్యారు. మొత్తంగా 12 గ్రామల నుంచి టీఆర్ఎస్ పార్టీ లో చేరారు.

  నవంబర్ 3న దుబ్బాక ఉప ఎన్నికలు జరగనున్నాయి. టీఆర్ఎస్ పార్టీ తరఫున రామలింగారెడ్డి సతీమణ సుజాత పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున చెరుకు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు. మూడు పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను హరీశ్ రావు భుజాన వేసుకున్నారు. సోలిపేట సుజాత తరఫు ముమ్మర ప్రచారం చేస్తున్నారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Harish Rao, Telangana, Trs

  ఉత్తమ కథలు