హోమ్ /వార్తలు /national /

Dubbaka ByPoll: దుబ్బాక ఉప ఎన్నిక అభ్యర్థిని ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం

Dubbaka ByPoll: దుబ్బాక ఉప ఎన్నిక అభ్యర్థిని ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం

చెరుకు శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పుతున్న టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

చెరుకు శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పుతున్న టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

దుబ్బాక శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డిని తమ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది.

  దుబ్బాక శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డిని తమ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ముకుల్ వాస్నిక్ ఓ ప్రకటన విడుదల చేశారు. దుబ్బాక ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తరఫున చెరుకు శ్రీనివాస్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోందించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక, దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేద్దామని భావించిన శ్రీనివాస్‌రెడ్డికి నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో ఆయన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఖరారు అయినప్పటికీ.. తాజాగా అధికారిక ప్రకటన వెలువడింంది.

  ఇక, దుబ్బాకలో కాంగ్రెస్ ‌ఓటు బ్యాంక్‌తోపాటు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కూడా శ్రీనివాస్‌రెడ్డి సొంతం చేసుకుంటాడని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలుపొందాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దుబ్బాక ప్రాంతంలో తన తండ్రి ముత్యంరెడ్డి చేసిన అభివృద్ది గురించి ప్రస్తావిస్తూ శ్రీనివాస్‌రెడ్డి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మరోవైపు దుబ్బాక స్థానానికి టీఆర్ఎస్ పార్టీ సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత పేరును ఖరారు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె బుధవారం సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్.. ఆమెకు పార్టీ బీఫామ్ అందజేశారు. ఇక, బీజేపీ తమ పార్టీ తరఫున రఘునందన్‌రావును ప్రకటించింది. దీంతో దుబ్బాక ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా మారింది.

  సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో దుబ్బాకలో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఎన్నికకు నోటిఫికేషన్ వెలవడక ముందు నుంచే అక్కడ రాజకీయ వేడి నెలకొంది. ఉప ఎన్నిక తేదీ ఖరారు కావడంతో అది మరింతగా పెరిగింది. ఇక, దుబ్బాక ఉప ఎన్నికకు అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 16వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబర్ 17న నామినేషన్లను పరిశీలించనున్నారు. అక్టోబర్ 19 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అఖరు తేదీగా నిర్ణయించారు. నవంబర్ 3న పోలింగ్ నిర్వహించి, నవంబర్ 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Congress, Dubbaka By Elections 2020

  ఉత్తమ కథలు