హోమ్ /వార్తలు /national /

Dubbaka By Poll: దుబ్బాక ఉప ఎన్నిక.. బరిలో మొత్తం 23 మంది అభ్యర్థులు

Dubbaka By Poll: దుబ్బాక ఉప ఎన్నిక.. బరిలో మొత్తం 23 మంది అభ్యర్థులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దుబ్బాక శాసనసభ నియోజకవర్గం ఉపఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం సాయంత్రంతో ముగిసింది.

  దుబ్బాక శాసనసభ నియోజకవర్గం ఉపఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం సాయంత్రంతో ముగిసింది. మొత్తం 46 మంది నామినేషన్లు దాఖలు కాగా, స్క్రూటినీలో 12 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మరో 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో మొత్తంగా 23 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. టీఆర్‌ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, బీజేపీ నుంచి రఘునందన్‌రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా బిగ్‌బాస్ ఫేమ్ కత్తి కార్తీక బరిలో నిలిచారు. మరో నలుగురు అభ్యర్థులు చిన్న పార్టీల నుంచి బరిలో నిలిచారు. ఇక, మిగిలిన 15 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు.

  ఇక, నవంబర్ 3వ తేదీన దుబ్బాకలో పోలింగ్ జరగనుంది. 10వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతుంది. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఆ వేడి మరింత పెరిగింది. అధికార, ప్రతిపక్షాలు మధ్య మాటల దాడి కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ టీఆర్‌ఎస్ నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు రాష్ట్రంలోని టీఆర్ఎస్ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ కూడా టీఆర్‌ఎస్ లక్ష్యంగా తమ ప్రచారాన్ని కొనసాగిస్తుంది.

  దుబ్బాక ఉప ఎన్నిక బరిలో అభ్యర్థులు

  ఇక, అధికార టీఆర్‌ఎస్ నుంచి మంత్రి దుబ్బాక ఉపఎన్నికల బాధ్యతలు చూసుకుంటున్నారు. టీఆర్ఎస్ తరఫున అన్నీతానై వ్యవహరిస్తున్నారు. ఇక, గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 4 స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ.. దుబ్బాక ఉప ఎన్నికపై భారీగానే ఆశలు పెట్టుకుంది. ఎలాగైనా దుబ్బాకలో బీజేపీ జెండా ఎగరవేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్ నుంచి తమ పార్టీలో చేరిన మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా బరిలో నిలిపింది. ముత్యంరెడ్డి అభిమానులతోపాటుగా, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ తమను గెలిపిస్తాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు టీపీసీసీ నేతలు శ్రీనివాస్‌రెడ్డి తరఫున ప్రచారం కూడా నిర్వహించారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Dubbaka By Elections 2020

  ఉత్తమ కథలు