హోమ్ /వార్తలు /national /

Dubbaka By Poll: బీజేపీని టార్గెట్ చేస్తూ హరీష్ రావు ప్రచారం

Dubbaka By Poll: బీజేపీని టార్గెట్ చేస్తూ హరీష్ రావు ప్రచారం

హరీశ్ రావు (File)

హరీశ్ రావు (File)

దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నిక వేడి రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలోనే దుబ్బాకలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు టీఆర్‌ఎస్ తరఫున అన్నీ తానై వ్యవహారిస్తున్నారు

  దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నిక వేడి రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలోనే దుబ్బాకలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు టీఆర్‌ఎస్ తరఫున అన్నీ తానై వ్యవహారిస్తున్నారు. అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోయినప్పటికీ.. కిందిస్థాయిలో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతూ ముందు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి హరీశ్‌రావు.. బీజేపీని టార్గెట్ చేస్తూ దుబ్బాకలో ప్రచారం కొనసాగించారు. రెండు రోజుల క్రితం దుబ్బాకలో బీజేపీ కార్యకర్తలు లేరని వ్యాఖ్యానించిన హరీశ్‌రావు.. మరోసారి బీజేపీపై విమర్శలు గుప్పించారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ చట్టం సవరణ బిల్లుపై ఆయన మండిపడ్డారు.

  బావులకు, బోర్లకు మీటర్లు పెట్టాలంటున్న బీజేపీకి సమాధానం చెప్పే అవకాశం దుబ్బాక ప్రజలకు వచ్చిందన్నారు. తెలంగా అంతా దుబ్బాక ప్రజల వైపు చూస్తోందని వ్యాఖ్యానించారు. ఆఫ్రికా మక్కలు దిగుమతి చేస్తామని అంటున్న బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. ఆఫ్రికా మక్కలు తెస్తే తెలంగాణ రైతుల మక్కలు ఎవరు కొంటారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల తరఫున దుబ్బాక ప్రజలు తమ ఓటుతో బీజేపీని దెబ్బగొట్టాలని పిలుపునిచ్చారు. ఇక, శిలాజీ నగర్, వెంకటగిరి తండా గ్రామస్థులు టీఆర్‌ఎస్‌కే తమ ఓటని ఏకగ్రీవ తీర్మానం చేశారు. మంత్రి హరీశ్‌రావు పర్యటన సందర్భంగా తీర్మాన ప్రతిని ఆయనకు అందజేశారు.

  ఇక, టీఆర్ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణించడంతో దుబ్బాకలో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. దీంతో అధికార టీఆర్ఎస్ రామలింగారెడ్డి కుటుంబ సభ్యులను బరిలోకి దించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. మరోవైపు దుబ్బాక టికెట్ తనకు కేటాయించాలని మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి తనయుడు శ్రీనివాస్‌రెడ్డి అధిష్టానం‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్‌ఎస్ టికెట్ దక్కకపోతే ఇండిపెండెంట్‌గానైనా బరిలో నిలవాలని శ్రీనివాస్‌రెడ్డి భావిస్తున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Bjp, Dubbaka By Elections 2020, Harish Rao

  ఉత్తమ కథలు