హోమ్ /వార్తలు /national /

Dubbaka By Poll: అధికార పార్టీకి తలనొప్పిగా మారిన అభ్యర్థులు..!

Dubbaka By Poll: అధికార పార్టీకి తలనొప్పిగా మారిన అభ్యర్థులు..!

తెలంగాణ రాష్ట్ర సమితి రూ. 188 కోట్లతో ఆరో స్థానంలో నిలిచింది.

తెలంగాణ రాష్ట్ర సమితి రూ. 188 కోట్లతో ఆరో స్థానంలో నిలిచింది.

దుబ్బాకలో అధికార టీఆర్ఎస్.. దివంగత రామలింగారెడ్డి కుటుంబం నుంచి ఒకరిని బరిలో నిలపాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.

  దుబ్బాక సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో.. ఆ నియోజకవర్గంలోలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయ వేడి నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్ దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీకి దిగుతామని ప్రకటించింది. బీజేపీ నాయకత్వం కూడా ఉప ఎన్నికలో పార్టీ తరఫున బలమైన అభ్యర్థిని పోటీలో నిలపాలని భావిస్తోంది. ఇక, దుబ్బాకలో అధికార టీఆర్ఎస్.. దివంగత రామలింగారెడ్డి కుటుంబం నుంచి ఒకరిని బరిలో నిలపాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. రామలింగారెడ్డి తనయుడు సతీష్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని ఆయన కుటుంబం కోరుతున్నా...స్థానిక పార్టీ నేతల సూచన మేరకు ఆయన భార్య సుజాతకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో నిర్ణయంపై టీఆర్ఎస్ అధిష్టానం నిశితంగా  ఆలోచినట్టుగా సమాచారం.

  ఇదిలా ఉండగానే మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి దుబ్బాక ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ టికెట్ కోసం తనవంతు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా సమాచారం. ఈ మేరకు టీఆర్‌ఎస్ అధిష్టానంపై సీనియర్ నేతలతో ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తోంది. అటు టీఆర్‌ఎస్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తునే ఇటు ప్రచారంలో కూడా దూసుకెళ్తున్నారు. తన తండ్రి ముత్యంరెడ్డి ఉన్నప్పుడు దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి చెందిందని చెబుతున్నారు. తన తండ్రి సేవలను గుర్తుచేస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకవేళ టీఆర్‌ఎస్ టికెట్ దక్కకపోయినా స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో నిలవాలని శ్రీనివాస్‌రెడ్డి భావిస్తున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

  ఇక, ముత్యంరెడ్డి 1989 లో తొలిసారిగా అప్పటి దొమ్మాట నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత వరుసగా 1994, 1999 లో ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్‌ గెలుపు సాధించారు. 1999లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ముత్యంరెడ్డి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించాడు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున దుబ్బాక నియోజకవర్గం పోటీ చేసి గెలుపొంది.. రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌గా, టీటీడీ బోర్డు సభ్యులుగా పనిచేశారు. 2018 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ మహాకూటమిలో టికెట్ రాకపోవడంతో చెరుకు ముత్యంరెడ్డి నిరాశతో టీఆర్ఎస్‌లో చేరారు. ఆ తర్వాత 2019 సెప్టెంబర్ 2న అనారోగ్యంతో చెరుకు ముత్యంరెడ్డి మృతిచెందారు. ఆ తర్వాత శ్రీనివాస్‌రెడ్డికి నామినేట్ పదవి ఇస్తారని అంతా అనకున్నారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Trs

  ఉత్తమ కథలు