హోమ్ /వార్తలు /national /

Dubbaka ByPolls: దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో టీఆఎస్, బీజేపీ కార్యకర్తల ఫైట్

Dubbaka ByPolls: దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో టీఆఎస్, బీజేపీ కార్యకర్తల ఫైట్

దుబ్బాకలో టీఆర్ఎస్ , బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

దుబ్బాకలో టీఆర్ఎస్ , బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, ఘర్షణ తలెత్తింది. ఇరువర్గాల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చారు.

  Dubbaka ByElections 2020: దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, ఘర్షణ తలెత్తింది. దుబ్బాక మండలం అప్పన్ పల్లి గ్రామంలో మంత్రి హరీశ్ రావు ప్రచారం చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.  టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చారు. దీంతో మంత్రి హరీశ్ రావు అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లిపోయారు.

  మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలు టీఆర్ఎస్, కేసీఆర్ వైపే ఉన్నారని, వారిని తమ పార్టీ కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని ఇటీవల మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ముంపు బాధితులకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి 70 శాతం నష్టపరిహారం అందిందని.. ఎన్నికలు వచ్చిన్నప్పుడే ప్రతిపక్షాలకు ముంపు బాధితులు గుర్తుకు వస్తారని ఆయన మండిపడ్డారు. రామలింగారెడ్డి వైపే ప్రజలు ఉన్నారని హరీశ్ అన్నారు. దుబ్బాక అభివృద్ధిలో వెనుక బడిందని ప్రతిపక్షాలు అనడం విడ్డూరమని.. ప్రతిపక్షాలకి ఉప ఎన్నికల్లో చెప్పుకోవడానికి ఏమి లేదు కాబట్టి, ఇలాంటి కాయకొరుకుడు మాటలు మాట్లాడుతున్నారని హరీశ్ ఎద్దేవా చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని మంత్రి మరోసారి ధీమా వ్యక్తం చేశారు.

  నవంబర్ 3న దుబ్బాక ఉప ఎన్నికలు జరగనున్నాయి. టీఆర్ఎస్ పార్టీ తరఫున రామలింగారెడ్డి సతీమణ సుజాత పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున చెరుకు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం దుబ్బాకలో రఘునందన్ రావు బంధువు నివాసంలో డబ్బులు పట్టుబడడం పెద్ద సంచలనంగా మారింది. ఆ సమయంలో కొందరు బీజేపీ కార్యకర్తలు పోలీసుల మీద దాడి చేసి పట్టుబడిన నగదులో కొంత ఎత్తుకుపోయారని కూడా టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ అంశం తెలంగాణలో పెద్ద దుమారం రేగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీద కూడా దాడి జరిగింది. ఈ అంశం పెను సంచలనంగా మారింది.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Harish Rao, Telangana

  ఉత్తమ కథలు