హోమ్ /వార్తలు /national /

Dubbaka ByPolls: దుబ్బాకలో రాజకీయ పార్టీలకు కలెక్టర్ ముఖ్యమైన గమనిక

Dubbaka ByPolls: దుబ్బాకలో రాజకీయ పార్టీలకు కలెక్టర్ ముఖ్యమైన గమనిక

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమయ్యే అన్ని రకాల రాజకీయ ప్రచార ప్రకటనలను ఎంసీఎంసీ కమిటీచే ముందస్తుగా అనుమతి పొందాలని సిద్దిపేట కలెక్టర్ స్పష్టం చేశారు.

  దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికలో నిర్వహించే ప్రచార కార్యక్రమాలకు సంబంధించి అడ్వర్‌టైజ్‌మెంట్లు, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ప్రసారం చేసే వీడియో అడ్వటైజ్‌మెంట్లకు, బహిరంగ ప్రదేశాల్లో వీడియో విజువల్ ప్రదర్శనకు ముందస్తుగా జిల్లా మీడియా సర్టిఫికేట్ అండ్ మానిటరింగ్ కమిటి నుంచి అనుమతులు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ వెంకట్రామ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన జారీ చేసారు. ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి వివిధ వార్తపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే పెయిడ్‌న్యూస్ గుర్తింపునకు ఎంసీఎంసీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కమిటీ ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల్లో ప్రసారమయ్యే కథనాలను పరిశీలించి అతిక్రమణలు జరిగితే తగు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమయ్యే అన్ని రకాల రాజకీయ ప్రచార ప్రకటనలను ఎంసీఎంసీ కమిటీచే ముందస్తుగా అనుమతి పొందాలని, అదేవిధంగా పోలింగ్ రోజు, ముందు రోజు ప్రచురితమయ్యే ప్రింట్ మీడియా ప్రకటనలకు కూడా అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నా రు.

  దుబ్బాక అసెంబ్లీ స్థానానికి పోటీచేసే అభ్యర్థులకు మాత్రమే జిల్లా ఎంసీఎంసీ కమిటీచే రాజకీయ ప్రచార ప్రకటనలకు అనుమతి జారీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీల ప్రకటనలకు సంబంధించి రాష్ట్రస్థాయి ఎంసీఎంసీ కమిటికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ వెంకట్రామ రెడ్డితెలియజేశారు. పోటీచేసే అభ్యర్థులు జిల్లా ఎంసీఎంసీకి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

  కేబుల్, సాటిలైట్ ఛానెల్స్ అనుమతి లేని ప్రకటనలను ప్రసారం చేయవద్దు: వెంకట్రామ రెడ్డి

  జిల్లా మీడియా సర్టిఫికేట్ అండ్ మానిటరింగ్ కమిటి నుంచి అనుమతులు లేని రాజకీయ ప్రకటనలు కేబుల్ , సాటిలైట్, ఇతర ఛానెల్స్ ద్వారా ప్రచారం చేయవద్దని జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ వెంకట్రామ రెడ్డి పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించి అనుమతులు లేని రాజకీయ ప్రకటనలు ప్రసారం చేసే ఎలక్ట్రానిక్ మాధ్యమాలు, రాజకీయ పార్టీ అభ్యర్తులపై ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం చర్యలు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  ఎన్నికల ఉల్లంఘనలపై అప్రమత్తంగా ఉండండి : జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ శ్రీ వెంకట్రామ రెడ్డి

  ఎన్నికల ఉల్లంఘనలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి ఎన్నికల క్షేత్రస్థాయి అధికారులను అధికారులను ఆదేశించారు. అనుమానిత వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు . సంబంధిత పత్రాలు లేకుండా పరిమితికి మించి నగదు తీసుకెళుతుంటే సీజ్ చేయాలన్నారు . అనుమతి లేకుండా జెండాలు పెట్టుకుని వాహనాల ద్వారా ప్రచారం చేసే వాహనాలను గుర్తించి సీజ్ చేయాలన్నారు . అధికారులు నిర్భయంగా , నిస్పక్షపాతంగా విధులు నిర్వర్తించి ఎన్నికలు సజావుగా , స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా జరిగేలా చూడాలన్నారు.

  దుబ్బాకలో నవంబరు 3న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబరు 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. దుబ్బాక ఉపఎన్నికకు సంబంధించి ఈ నెల 9న నోటిఫికేషన్ జారీ అయింది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబరు 16. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు ముత్యం రెడ్డి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబరు 19 వరకు గడువు ఉంటుంది.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Telangana

  ఉత్తమ కథలు