హోమ్ /వార్తలు /national /

Raghunandan Rao: దుబ్బాక గడ్డ నుంచి వచ్చిన రీసౌండ్.. పోలీస్ కమిషనర్‌కు అంకితమన్న రఘునందన్‌రావు

Raghunandan Rao: దుబ్బాక గడ్డ నుంచి వచ్చిన రీసౌండ్.. పోలీస్ కమిషనర్‌కు అంకితమన్న రఘునందన్‌రావు

రఘునందన్ రావు (ఫైల్ ఫోటో)

రఘునందన్ రావు (ఫైల్ ఫోటో)

Raghunandan Rao: తాను దుబ్బాకలోనే చదువుకున్నానని పదే పదే చెప్పే కేసీఆర్‌కు.. ఆ దుబ్బాక ఉపాధ్యాయులు ఇచ్చిన తీర్పు కనువిప్పు కావాలని రఘునందన్ రావు అన్నారు.

  దుబ్బాక ప్రజలు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రీసౌండ్ వచ్చేలా తీర్పునిచ్చారని దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. తాను దుబ్బాకలోనే చదువుకున్నానని పదే పదే చెప్పే కేసీఆర్‌కు.. ఆ దుబ్బాక ఇచ్చిన తీర్పుతో కనువిప్పు తెచ్చుకోవాలని సూచించారు. సిద్దిపేటలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఉప ఎన్నికల సందర్భంగా తమను ఎంతగా వేధించాలో అంతగా వేధించారని ఆరోపించారు. ఒక మనిషిని ఎంతగా వేధించాలో అంతగా వేధించారని అన్నారు. తనకు ఏ మాత్రం సంబంధం లేని అనేక మంది వ్యక్తులు... తన గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారని రఘునందన్ రావు అన్నారు.

  తన విజయం కోసం పని చేసిన ఎంతోమంది బూత్ స్థాయి ఏజెంట్లను ప్రభుత్వం వేధించిందని.. వారిలో పలువురు జైళ్లలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు ప్రజాస్వామ్యం గొప్పతనమని అన్నారు. ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రహోంమంత్రి అమిత్‌షాకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ప్రచారంలో సహకరించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ ధర్మపురి అర్వింద్‌, నేతలు డీకే అరుణ, జితేందర్‌రెడ్డితో పాటు బూత్‌స్థాయి కార్యకర్తలకు రఘునందన్‌ ధన్యవాదాలు తెలిపారు.

  Raghunandan Rao, Raghunandan Rao comments on cm kcr, dubbaka by election results, Raghunandan Rao comments after dubbaka by election, రఘునందన్ రావు, దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు విజయం, దుబ్బాక న్యూస్
  రిటర్నింగ్‌‌ అధికారి నుంచి గెలుపు ధృవీకరణ పత్రాన్ని అందుకుంటున్న బిజెపి అభ్యర్థి రఘునందన్‌‌ రావు

  తనతో ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా తెలుగు రాష్ట్రాల్లో చాలామంది భాజపా గెలుపును ఆకాంక్షించారన్నారు. దుబ్బాక నుంచి డల్లాస్‌ వరకూ తన విజయాన్ని కోరుకున్నారని చెప్పారు. తన గెలుపు కోసం పని చేసిన ప్రతి ఒక్క బీజేపీ నాయకుడికి రఘునందన్ రావు తెలిపారు. చివరగా తన గెలుపును సిద్ధిపేట పోలీస్ కమిషనర్‌కు అంకితం ఇస్తున్నానని రఘునందన్ రావు అన్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Raghunandan rao, Telangana

  ఉత్తమ కథలు