హోమ్ /వార్తలు /national /

Dubbaka by election 2020: దుబ్బాక ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..

Dubbaka by election 2020: దుబ్బాక ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎన్నికల షెడ్యూల్ విడులయిన నేపథ్యంలో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఇవాళ్టి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. పార్టీల ప్రచారం కూడా ఊపందుకోనుంది.

  దుబ్బాకలో ఎన్నికల నగారా మోగింది. దుబ్బాక ఉపఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దుబ్బాకతో పాటు దేశవ్యాప్తంగా 54 అసెంబ్లీ నియోజవకర్గాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబరు 3న పోలింగ్ నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. నవంబరు 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. దుబ్బాక ఉపఎన్నికకు సంబంధించి ఈ నెల 9న నోటిఫికేషన్ జారీ చేస్తారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబరు 16. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబరు 19 వరకు గడువు ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ విడులయిన నేపథ్యంలో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఇవాళ్టి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. పార్టీల ప్రచారం కూడా ఊపందుకోనుంది.

  కరోనా నేపథ్యంలో .. ఎన్నికల ప్రచారం మొదలు.. ఓటింగ్ వరకు.. ఎన్నో మార్పులు చోటుచేసుకోనున్నాయి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే నామినేషన్ వేసే అవకాశం కల్పిస్తున్నారు. సామాజిక దూరం పాటించేందుకు వీలైనన్ని ఎక్కువ పోలీస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ధర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లను అందుబాటులో ఉంచరుతారు. 46 లక్షల మాస్క్‌లు, 6 లక్షల పీపీఈ కిట్లు, 7 లక్షల శానిటైజర్లు, 7.6 లక్షల ఫేస్ షీల్డ్స్, 23 లక్షల హ్యాండ్ గ్లవ్స్ అందుబాటులో ఉంచనున్నారు. పోలింగ్ సమయాన్ని గంట పెంచారు. ఉదయం 7 గంటల నుంచి సాయంగ్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. మాస్క్ ఉన్న వారిని మాత్రమే ఓటింగ్‌కు అనుమతిస్తారు. చివరి గంటలో కోవిడ్ రోగులకు ఓటువేసే అవకాశం కల్పిస్తారు.

  2018 డిసెంబర్‌లో జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దుల నాగేశ్వరరెడ్డి పోటీ చేశారు. రామలింగారెడ్డికి 89,299 ఓట్లు వచ్చాయి. నాగేశ్వరరెడ్డికి 26,799 ఓట్లు వచ్చాయి. 62,500 ఓట్ల తేడాతో రామలింగారెడ్డి విజయం సాధించారు. అయితే, కొన్ని రోజుల క్రితం రామలింగారెడ్డి హఠాన్మరణం చెందారు. దీంతో దుబ్బాకలో ఉప ఎన్నిక వచ్చింది. కాంగ్రెస్ పార్టీ బరిలో దిగుతామని చెప్పడంతో పోలింగ్ అనివార్యం అయింది.

  దుబ్బాకలో ఇప్పటికే ప్రచారంలో అన్ని పార్టీలో దూసుకెళ్తున్నాయి. కానీ ఏ పార్టీ అధికారికంగా అభ్యర్థిని ప్రకటించలేదు. టీఆర్ఎస్ నుంచి రామలింగారెడ్డి సతీమణి సుజాతకు టికెట్ దక్కుతుందని ప్రచారం దక్కుతుంది. ఇక బీజేపీ నుంచి రఘునందర్ రావు పేరు దాదాపుగా ఖరారయింది. ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో ఊరూరు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలోకి దిగుతారన్నది తెలియాల్సి ఉంది. స్వతంత్ర అభ్యర్థి బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తీక బరిలో ఉన్నారు.

  కాగా, ఇప్పటికే బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి దశలో 16 జిల్లాల్లోని 71 నియోజకవర్గాలు, రెండో దశలో 17 జిల్లాల్లోని 94 నియోజకవర్గాలు, మూడో దశలో 15 జిల్లాల్లో 78 నియోజవకర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. అక్టోబరు 28న తొలి దశ, నవంబరు 3న రెండో దశ, నవంబరు 7న మూడో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. నవంబరు 10న ఫలితాలను ప్రకటిస్తారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Telangana, Telangana Politics

  ఉత్తమ కథలు