హోమ్ /వార్తలు /national /

Dubbaka by Poll: కొద్ది గంటల్లో ప్రచారం ముగియనున్న వేళ బీజేపీకి భారీ షాక్

Dubbaka by Poll: కొద్ది గంటల్లో ప్రచారం ముగియనున్న వేళ బీజేపీకి భారీ షాక్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మరికొద్ది గంటల్లో దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం ముగియనున్న వేళ బీజేపీకి భారీ షాక్ తగిలింది. కమలం పార్టీకి చెందిన బహిష్కృత నేత తోట కమలాకర్‌రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు.

  మరికొద్ది గంటల్లో దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం ముగియనున్న వేళ బీజేపీకి భారీ షాక్ తగిలింది. కమలం పార్టీకి చెందిన బహిష్కృత నేత తోట కమలాకర్‌రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి, టీఆర్‌ఎస్ ముఖ్య నేత హరీష్‌రావు సమక్షంలో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా తోటకమలాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ అబద్దాలు మాట్లాడుతుందని విమర్శించారు. ఆ మాటలతో బీజేపీ కార్యకర్తలు అంతర్మథనానికి లోనై టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. తాను అడిగిన ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా బీజేపీ నాయకులు సమధానం చెప్పలేకపోయాని విమర్శించారు. బీజేపీ జూటా పార్టీ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీలో తిరిగేది కిరాయి మనుషులను ఆరోపించారు.

  రైతు బంధు, రైతు బీమా, పెన్షన్లు ఇచ్చి రైతులను టీఆర్‌ఎస్ పార్టీ కడుపులో పెట్టకుని చూసుకుంటుందని అన్నారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇస్తుందని చెప్పారు. కానీ విదేశాల నుంచి మక్కలు తెచ్చి ఇక్కడ అమ్మే పార్టీ, బావిల వద్ద మీటర్లు పెట్టే పార్టీ బీజేపీ అని.. అలాంటి పార్టీని గెలిపించుకుంటే లాభపడతామనేది ఆలోచన చేయాలని దుబ్బాక ప్రజలను కోరారు. బీజేపీ నాయకులు వానకాలంలో వచ్చే ఊసిళ్లలా లాంటోళ్లని.. కానీ టీఆర్‌ఎస్ ప్రజలకు కష్టాల్లో అండగా నిలుస్తందని చెప్పారు. కరోనా కాలంలో ఇది మరోసారి రుజువు అయిందని తెలిపారు. ఇక, తోట కమలాకర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం స్థానికంగా బీజేపీకి కొద్దిగా ఇబ్బందికరంగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  ఇక, దుబ్బాకలో బీజేపీ అభ్యర్థిగా మాధవనేని రఘునందర్‌రావును ఖరారు చేయడంపై తోట కమలాకర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రఘునందన్‌రావు లాంటి వ్యక్తికి పార్టీ టికెట్‌ ఇవ్వడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై పార్టీ అధిష్తానం పునరాలోచించాలని కమలాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే రఘునందన్ రావు అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో తోట కమలాకర్‌రెడ్డిని పార్టీ నుంచి బీజేపీ తొలగిస్తూ ప్రకటన చేసింది.

  మరోవైపు నేటి సాయంత్రంతో దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం ముగియనుంది. ఆలోపు ఇతర ప్రాంతాల నుంచి ప్రచారానికి వచ్చిన నాయకులంతా దుబ్బాక విడిచి వెళ్లాల్సి ఉంటుంది. మంగళవారం రోజున దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Bjp, Dubbaka By Elections 2020, Harish Rao, Trs

  ఉత్తమ కథలు