హోమ్ /వార్తలు /national /

ఏపీ సర్కార్ డబుల్ పేమెంట్లు.. టీడీపీ నేత సంచలన ఆరోపణలు

ఏపీ సర్కార్ డబుల్ పేమెంట్లు.. టీడీపీ నేత సంచలన ఆరోపణలు

దేవినేని ఉమ, వైఎస్ జగన్ (ఫైల్)

దేవినేని ఉమ, వైఎస్ జగన్ (ఫైల్)

పెన్షనర్ల చెల్లింపుల్లో జులై 30న డబుల్ పేమెంట్ జరిగిందని.. చిత్తూరు జిల్లాలో కొందరు కాంట్రాక్టర్లకు డబుల్ పేమెంట్ చేశారని మాజీమంత్రి దేవినేని ఉమ ఆరోపించారు.

  ఏపీ ఆర్థికశాఖపై టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమ సంచలన ఆరోపణలు చేశారు. సిఎఫ్ఎంఎస్‌ను పక్కనపెట్టి ఆర్థికశాఖ నుంచి బ్యాక్ ఎండ్ పేమెంట్స్ జరిగాయని ఆరోపణలు చేశారు. రాష్ట్ర ఖజానా నుంచి పెన్షన్ల కోసం రూ. 1400 కోట్లకు రూ. 2800 కోట్లు చెల్లించారని విమర్శించారు. పెన్షనర్ల చెల్లింపుల్లో జులై 30న డబుల్ పేమెంట్ జరిగిందని.. చిత్తూరు జిల్లాలో కొందరు కాంట్రాక్టర్లకు డబుల్ పేమెంట్ చేశారని ఆరోపించారు. ఒక్కసారి ఖజానా నుంచి వెళ్లిన తరువాత ప్రభుత్వానికి డబ్బు వెనక్కి వస్తుందా ? అని దేవినేని ఉమా ప్రశ్నించారు. ఖజానా నుంచి డబుల్ పేమెంట్ జరగడం అనేది తీవ్రమైన తప్పిదమని వ్యాఖ్యానించారు.

  ఈ వ్యవహారంపై ఫైనాన్స్ సెక్రటరీ, ఆర్థిక మంత్రి తక్షణమే వివరణ ఇవ్వాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. ఫైనాన్స్ సెక్రటరీ మాటలతో ఒక ప్రోగ్రామర్ ఖజానా నుంచి నిధులను ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటివరకు బ్యాక్ ఎండ్ పేమెంట్స్ రూపంలో ఎంత చెల్లింపులు జరిపారో మంత్రి బుగ్గన స్పష్టం చేయాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Devineni uma

  ఉత్తమ కథలు