Home /News /national /

POLITICS DO WE LOOK LIKE CARTOONS MIFFED WITH POLITICAL SATIRES KUMARASWAMY PLANS LAW TO REGULATE MEDIA MS

ఏం.. కార్టూన్స్‌లా కనిపిస్తున్నామా?.. అవసరమైతే ఆ పని కూడా చేస్తా : కుమారస్వామి

కర్ణాటక ముఖ్యమంత్రి కుామరస్వామి ( ఫైల్ ఫోటో)

కర్ణాటక ముఖ్యమంత్రి కుామరస్వామి ( ఫైల్ ఫోటో)

మీడియాలో తమపై వచ్చే కథనాలన్నింటిని చూస్తూ కూర్చుంటే.. రాత్రి నిద్ర కూడా పట్టదన్నారు కుమారస్వామి. ఇక ప్రధాని నరేంద్ర మోదీ కేదార్‌నాథ్ యాత్రపై కూడా కుమారస్వామి విమర్శలు చేశారు.

    కర్ణాటక సీఎం కుమారస్వామి మీడియా తీరుపై మరోసారి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక సెక్షన్ మీడియా ఉద్దేశపూర్వకంగా తమను హేళన చేస్తోందని మండిపడ్డారు. తామేమైనా కార్టూన్స్‌లా కనిపిస్తున్నామా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్-జేడీఎస్ బంధం ఎక్కువ రోజులు కొనసాగదని ఒక సెక్షన్ మీడియా పనిగట్టుకుని ప్రచారం చేస్తోందని ఆరోపించారు. భవిష్యత్‌లోనూ తమ మైత్రి సాఫీగానే కొనసాగుతుందని స్పష్టం చేశారు. తమపై చేస్తున్న దుష్ప్రచారానికి, హేళనకు మీడియాను నియంత్రించాల్సిన అవసరం ఉందని.. అవసరమైతే ఇందుకోసం కొత్త చట్టం తీసుకొస్తామని చెప్పారు. తాజాగా మైసూరులో ఓ బహిరంగ సభలో పాల్గొన్న సందర్భంగా కుమారస్వామి మాట్లాడారు.

    రాజకీయ నాయకుల గురించి అసలేం అనుకుంటున్నారు?.. మీరు హేళన చేయడానికి మేమే దొరికామా..? మాపై వ్యంగ్యాస్త్రాలు సంధించడానికి మీకెవరు అనుమతిచ్చారు. మేమేమైనా పనీ పాటా లేకుండా ఉన్నామనుకుంటున్నారా?.. కార్టూన్స్‌లా కనిపిస్తున్నామా?.
    కుమారస్వామి, మైసూర్ బహిరంగ సభలో


    కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ సీఎం సిద్దారామయ్య దీవనెలతో జేడీఎస్‌ వారితో మైత్రిని ఇకముందు కూడా కొనసాగిస్తుందని కుమారస్వామి చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటిరోజే ప్రభుత్వం కూలిపోతుందన్న ప్రచారాన్ని ఖండించారు. తామేమి మీడియా వల్ల బతకడం లేదని.. రాష్ట్రంలోని 6.5కోట్ల మంది జనం కోసం పనిచేస్తున్నామని చెప్పారు. మీడియాను చూసి తానేమి బెదిరిపోవడం లేదని.. అందులో వచ్చే కథనాలేవి తాను పట్టించుకోనని చెప్పారు.ఒకవేళ మీడియాలో తమపై వచ్చే కథనాలన్నింటిని చూస్తూ కూర్చుంటే.. రాత్రి నిద్ర కూడా పట్టదన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ కేదార్‌నాథ్ యాత్రపై కూడా కుమారస్వామి విమర్శలు చేశారు. ఆఖరికి శివుడిని అడ్డుపెట్టుకుని మోదీ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల కోసమే మోదీ కేదార్‌నాథ్ యాత్ర చేపట్టారని ఆరోపించారు.
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: Karnataka, Karnataka Lok Sabha Elections 2019, Lok Sabha Elections 2019

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు