ఎన్నికల అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు పొందుపరిచినందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. గాంధీనగర్‌లో ఒక ప్లాట్, ఓ కమర్షియల్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణానికి సంబంధించి అమిత్ షా అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు పొందుపరిచినట్టు కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
ప్రభుత్వ లెక్కల ప్రకారం అమిత్ షా ప్లాట్ విలువ కనీసం రూ.66.5లక్షలు ఉంటుందని, కానీ ఆయన మాత్రం అఫిడవిట్‌లో రూ.25లక్షలు మాత్రమే అని పేర్కొన్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అంతేకాదు, లోక్‌సభ ఎన్నికలకు ముందు అమిత్ షా తన కుమారుడి బిజినెస్ కోసం రెండు ప్రాపర్టీలను కమర్షియల్ బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.25కోట్లు రుణం పొందారని.. ఆ వివరాలను కూడా అఫిడవిట్‌లో తప్పుగా పొందుపరిచారని ఆరోపిస్తోంది.ఈ నేపథ్యంలో అమిత్ షాపై తక్షణం అనర్హత వేటు వేసి ఆయన్ను ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌ను కోరింది. కాంగ్రెస్ ఫిర్యాదుపై ఈసీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Bjp, Gujarat, Gujarat Lok Sabha Elections 2019, Lok Sabha Election 2019