ఏపీలోని అధికార టీడీపీని విమర్శంచడంలో వైసీపీ నేతలు ఎప్పుడూ ముందుంటారు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. అయితే వైసీపీ నేతలతో పాటు టీడీపీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడును విమర్శించే విషయంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఎప్పటికప్పుడు అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తోంది. తాను తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏపీలో విడుదల కాకుండా అడ్డుకున్నారనో లేక మరే ఇతర కారణమో తెలియదు కానీ... ఏ మాత్రం అవకాశం వచ్చినా ఆయన టీడీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై స్పందించిన వర్మ... టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేశారు.
. @ysjagan bursts into laughter every time @ncbn speaks in assembly ..The last time I saw such reaction is when people see Brahmanandam on screen ..So is TDP a comedy track in AP Assembly ..Just Asking!
— Ram Gopal Varma (@RGVzoomin) July 11, 2019
ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు ఎప్పుడు మాట్లాడినా సీఎం జగన్ నవ్వుతున్నారని వర్మ కామెంట్స్ చేశారు. బ్రహ్మనందం తెరపై కనిపించినప్పుడు ప్రేక్షకులు కూడా ఇదే రకంగా నవ్వేవారని పరోక్షంగా టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేశారు. గతంలోనూ అనేకసార్లు చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన వర్మ... తాజాగా మరోసారి ఆయనపై ఈ రకమైన సెటైర్లు వేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm ys jagan mohan reddy, Brahmanandam, Chandrababu naidu, RGV