హోమ్ /వార్తలు /national /

వైవీ సుబ్బారెడ్డి పాత వీడియో... ‘దేవుడి ఆస్తులకు పరిరక్షకులా? భక్షకులా?’

వైవీ సుబ్బారెడ్డి పాత వీడియో... ‘దేవుడి ఆస్తులకు పరిరక్షకులా? భక్షకులా?’

వైవీ సుబ్బారెడ్డి(ఫైల్ ఫోటో)

వైవీ సుబ్బారెడ్డి(ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాల ఆస్తులను విక్రయించడాన్ని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తప్పుపట్టిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాల ఆస్తులను విక్రయించడాన్ని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తప్పుపట్టిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. 2014 నుంచి 2019 వరకు ఎంపీగా ఉన్న ఆయన చంద్రబాబునాయుడు హయాంలో దేవాలయాల భూములు విక్రయించాలన్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఆ వీడియోను టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అందులో ఉన్న వీడియోలో ఏముందంటే.. ‘రాష్ట్రంలో ఉన్న దేవుడి ఆస్తులను పరిరక్షించేది ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వమా? వారు పరిరక్షకులా? భక్షకులా? ఇంతకు ముందు రాష్ట్రంలో పరిపాలించిన ముఖ్యమంత్రలు అందరూ కూడా పరిరక్షకులుగానే దేవుడి ఆస్తులను కాపాడారు. ఇప్పుడు భూములు అమ్ముకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమొచ్చింది? ఇందులో ఆంతర్యం ఏంటి? ఈ భూబాగోతాలు అన్నిటి మీద కూడా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. దేవుడి సొమ్మునే కాజేయాలి. దేవుళ్లనే మింగేయాలనే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. దైవ కార్యక్రమాల పేరు చెప్పి దోపిడీ చేశారు. ఈ అధర్మ పాలనను మనం క్షమిస్తే అది మనల్ని మింగేసే వరకు వచ్చింది. రాష్ట్రంలో ప్రజల ఆస్తులు, దేవుడి ఆస్తులను మింగేసేకాడికి వచ్చింది. ప్రజలు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అవినీతి అన్యాయాలను, భూ కుంభకోణాలను...’ అంటూ అర్థంతరంగా ముగిసింది.

తాజాగా టీటీడీకి తమిళనాడులో ఉన్న 23 ఆస్తులను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, చంద్రబాబునాయుడు హయాంలో టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్నే తాము అమలు చేస్తున్నామని టీటీడీ తెలిపింది. దీంతోపాటు 1974 నుంచి ఇలా దేవాలయాల ఆస్తులను వేలం వేసే సంప్రదాయం కొనసాగుతోందని సుబ్బారెడ్డి తాజాగా ట్వీట్ చేశారు.

First published:

Tags: Andhra Pradesh, Devineni uma, Tdp, Tirumala Temple, Tirumala tirupati devasthanam, Ysrcp, YV Subba Reddy

ఉత్తమ కథలు