హోమ్ /వార్తలు /national /

అందుకోసమే కేసీఆర్‌తో జగన్ లాలూచీ పడ్డారు.. మాజీ మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం

అందుకోసమే కేసీఆర్‌తో జగన్ లాలూచీ పడ్డారు.. మాజీ మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం

మీడియాతో మాట్లాడుతున్న దేవినేని ఉమ (ఫైల్)

మీడియాతో మాట్లాడుతున్న దేవినేని ఉమ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమమహేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్ లాలూచీ పడ్డారని ఆరోపించారు.

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమమహేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్ లాలూచీ పడ్డారని ఆరోపించారు. హైదరాబాద్ లో ఆస్తుల కాపాడుకునేందుకు కేసీఆర్ తో లాలూచీ పడి సీలేరు, శబరిని తాకట్టు పెట్టే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని వ్యాఖ్యానించారు. పోలవరం డ్యామ్ ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించేందుకు సీఎం జగన్ రాజీపడ్డారని విమర్శించారు. ఇలా చేయడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలకు జగన్ ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులను వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఆపేసిందని ప్రశ్నించారు. పురుషోత్తపట్నంను ఎందుకు నడపలేకపోతున్నారని మండిపడ్డారు.

  పోలవరం లెఫ్ట్ కెనాల్, పురుషోత్తమపట్నం ఉండగా విశాఖకు పైప్ లైన్లు వేస్తామని మాట్లాడుతున్నారని.. ఇటువంటి నిర్ణయాలు పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆ పైప్ లైన్లలో ఎంత కమీషన్లు మాట్లాడుకున్నారని ప్రశ్నించారు. పోలవరం 7 ముంపు మండలాలపై కేసీఆర్ వ్యాఖ్యలకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

  చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 62 ప్రాజెక్టులు నిర్మించడానికి సంకల్పిస్తే.. వైఎస్ జగన్ కనీసం 6 ప్రాజెక్టులనైనా కడుతున్నారా అని దేవినేని ఉమ ప్రశ్నించారు. అలాగే పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: AP Politics, Devineni Uma Maheswara Rao, Polavaram, Ys jagan mohan reddy

  ఉత్తమ కథలు