హోమ్ /వార్తలు /national /

విశాఖపైనే దృష్టి.. కరోనా గోడు పట్టని జగన్.. మండిపడ్డ టీడీపీ నేత

విశాఖపైనే దృష్టి.. కరోనా గోడు పట్టని జగన్.. మండిపడ్డ టీడీపీ నేత

దేవినేని ఉమా, సీఎం జగన్

దేవినేని ఉమా, సీఎం జగన్

ఆగస్ట్ 15 నాటికి విశాఖ వెళ్లడంపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ విమర్శించారు.

  ఏపీలో కరోనా వేగంగా వైరస్ వ్యాపిస్తున్నా, సీఎం జగన్ ఎందుకు తన పాలనావిధానం మార్చుకోవడం లేదని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు కాపాడటానికి పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ త్యాగాలను గౌరవించాల్సిన పనిలేదా అని ఆయన మండిపడ్డారు. క్వారంటైన్ కేంద్రాల్లోని భోజనం తినలేక రోగులు ఛస్తున్నా పట్టించుకోరా అంటూ దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే 5, 6 రోజుల్లో కరోనా వ్యాప్తిలో రాష్ట్రం ఢిల్లీని మించిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని చెబుతున్న మాటలు ముఖ్యమంత్రికి వినబడుతున్నాయా? అని నిలదీశారు. రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లమంటారని.. అక్కడికి వెళితే ఖాళీ లేదంటారని ఆయన అన్నారు.

  గుంటూరు ఆసుపత్రిలో 30 మృతదేహాలున్నాయని... తెనాలిలో పారామెడికల్ సిబ్బంది మాస్కులు, కిట్ల కోసం రోడ్డెక్కారని దేవినేని ఉమ తెలిపారు. ప్రశ్నించేవారిని వేధింపులకు గురిచేయడం తప్ప, ప్రభుత్వం వాస్తవాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చిన రూ.8వేలకోట్లు దేనికి ఖర్చు చేశారని అని దేవినేని ప్రశ్నించారు. ప్రజలకు మనోధైర్యం కల్పించలేని ప్రభుత్వం ఎందుకని...కరోనా బాధితుల గోడు వారి వెతలు ముఖ్యమంత్రికి వినబడటం లేదా అంటూ ప్రశ్నించారు. ఆగస్ట్ 15 నాటికి విశాఖ వెళ్లడంపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని విమర్శించారు. వాలంటీర్, సచివాలయ వ్యవస్థతో రెవెన్యూ, పంచాయతీ రాజ్ వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయని తెలిపారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Coronavirus, Devineni uma

  ఉత్తమ కథలు