హోమ్ /వార్తలు /national /

మహిళలకు 10,5000 ఎగనామం.. ఆ మాట ఏమైందన్న టీడీపీ నేత

మహిళలకు 10,5000 ఎగనామం.. ఆ మాట ఏమైందన్న టీడీపీ నేత

దేవినేని ఉమ, జగన్ (ఫైల్)

దేవినేని ఉమ, జగన్ (ఫైల్)

Devineni Uma: బీసీ,ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్ నిధులు మాయమయ్యాయని... వారి సంక్షేమం అటకెక్కిందని దేవినేని ఉమ వ్యాఖ్యానించారు.

  ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ చేయూత పథకంపై టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. ఎన్నికలముందు 45ఏళ్లకే పెన్షన్ ఇస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అలా చూసుకుంటే ఒక్కో మహిళకు ఇస్తానన్నది రూ. 1,80,000 అని ఆయన అన్నారు. ఈ లెక్క ఏపీ ప్రభుత్వం ఆ మహిళలకు 105000 ఎగనామం పెట్టిందని విమర్శించారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్ నిధులు మాయమయ్యాయని... వారి సంక్షేమం అటకెక్కిందని ఆయన వ్యాఖ్యానించారు. స్వయంఉపాధి,ఆదరణ ఊసేలేదని దేవినేని ఉమ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీకాలనీలో రోడ్లు, హాస్టల్, సంక్షేమ భవనాల నిర్మాణం బంద్ అయ్యాయని అన్నారు. చేయూత అని చెప్పి ఏపీ ప్రభుత్వం వారందరికీ చెయ్యిచ్చిందని అన్నారు.


  నిన్న వైఎస్సార్ చేయూత పథకానికి జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారు. 45 ఏళ్ల వయస్సు నిండి 60 ఏళ్ల మధ్య ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750ల చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేల ఆర్థిక సాయం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. నేరుగా బ్యాంక్ ఖాతాల ద్వారా ఈ మొత్తాన్ని వారికి అందించనుంది. ఈ పథకం ద్వారా 23 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది. వైఎస్సార్ చేయూత పథకానికి రూ. 4,700 కోట్లు కేటాయించినట్టు సీఎం జగన్ తెలిపారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Devineni uma, Ysr Cheyutha Scheme

  ఉత్తమ కథలు