హోమ్ /వార్తలు /national /

ఏపీ మంత్రి కొడాలి నానిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

ఏపీ మంత్రి కొడాలి నానిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

మంత్రి కొడాలి నాని (ఫైల్)

మంత్రి కొడాలి నాని (ఫైల్)

జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రోజూ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని.. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలా జరగలేదని దేవినేని ఉమ వ్యాఖ్యానించారు.

  ఈ నెల 4న వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, గన్నవరం ఎమ్మెల్యే వంశీ మోహన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తనపై బెదిరింపులకు పాల్పడ్డారని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. ఈ మేరకు తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కొడాలి నాని రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని విమర్శించారు. ఒక బాధ్యత గల మంత్రి అయిఉండి అసభ్యకరంగా మాట్లాతున్నారని మండిపడ్డారు. తమను తమ పార్టీ అధినేత చంద్రబాబును ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించి...లారితో యాక్సిడెంట్ చేసి చంపేస్తా అని బెదిరించారని ధ్వజమెత్తారు.

  ఈ కుట్రలో సీఎం జగన్ కు భాగం ఉందని ఆయన అన్నారు. సీఎం జగన్ మెప్పు పొందటానికే మాట్లాడుతున్నారని దేవినేని ఉమ ఆరోపించారు. అమరావతి రైతులు, దళితులని,న్యాయ విభాగంలో ఉన్నవారిని తిడితే కేసులు ఉండవని అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని..శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే వైకాపా నాయకులకు వత్తాసు పలుకుతున్నారని ఆయన మండిపడ్డారు. గుడివాడలో టీడీపీ నాయకులపై 20 మంది గుండాలు ఇంటిమీద పడి దాడిచేసై ఇప్పటివరకు చర్యలు లేవని విమర్శించారు. దీనిపై డీజీపీ సుమోటోగా తీసుకుని కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Devineni Uma Maheswara Rao, Kodali Nani

  ఉత్తమ కథలు