Home /News /national /

POLITICS DEVENDRA FADNAVIS MAY TAKE OATH AS MAHARASHTRA CM TOMORROW SHINDE COULD BAG DY CM POST PVN

Maharashtra : మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్..డిప్యూటీ సీఎంగా షిండే రేపే ప్రమాణస్వీకారం!

ఫైల్ ఫొటో

ఫైల్ ఫొటో

BJP Govt In Maharashtra : అసెంబ్లీలో బలపరీక్షకు కొన్ని గంటల ముందు బుధవారం రాత్రి మహారాష్ట్ర సీఎం(Maharashtra CM)పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేశారు.

BJP Govt In Maharashtra : అసెంబ్లీలో బలపరీక్షకు కొన్ని గంటల ముందు బుధవారం రాత్రి మహారాష్ట్ర సీఎం(Maharashtra CM)పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేశారు. గురువారం అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఉద్దవ్ ప్రభుత్వాన్ని బుధవారం ఆదేశించగా..గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ శివసేన సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. అయితే మహారాష్ట్ర అసెంబ్లీలో గురువారం బలపరీక్ష జరగాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన క్షణాల్లోనే ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray)తన రాజీనామా ప్రకటించారు. ఫేస్​బుక్​ లైవ్​లో మాట్లాడిన ఉద్ధవ్​ తన నిర్ణయాన్ని వెలువరించారు. సుప్రీంకోర్టు తీర్పుని గౌరవిస్తున్నట్లు ఉద్దవ్ చెప్పారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్​సీపీ చీఫ్​ శరద్​ పవార్​కు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వానికి కొందరి దిష్టి తగిలిందని..ఆ దిష్టి ఎవరిదో అందరికీ తెలుసని ఉద్దవ్ ఠాక్రే అన్నారు. బయటివారు కాకుండా సొంతవాళ్లే తనకు నమ్మక ద్రోహం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నంబర్‌ గేమ్‌ ఆడటం తనకు ఇష్టంలేదన్నారు.  తన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం బాలాసాహెబ్​ ఆశయాలు నెరవేర్చిందన్నారు. ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్లు ఉద్దవ్ ఠాక్రే స్పష్టం చేశారు.

ఉద్ధవ్ ఠాక్రే రాజీనామాతో మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి తెరపడింది. సీఎం పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా నేపథ్యంలో మహారాష్ట్రలో బీజేపీ(BJP)ప్రభుత్వ ఏర్పాటుకి రంగం సిద్దమైంది. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేసిన నేపథ్యంలో బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని 42 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది.  మహారాష్ట్ర 20వ సీఎంగా మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ రేపు ప్రమాణస్వీకారం చేయవచ్చని సమాచారం.ఉద్దవ్ ప్రభుత్వాన్ని కూలదోసిన శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు నేతృత్వం వహించిన  ఏక్‌నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపడతారని సమాచారం. రెబల్ ఎమ్మెల్యేలలో 10 మందికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కూడిన బృందం బీజేపీలో విలీనమయ్యే అవకాశం ఉందని సమాచారం.



Dutch MP Geert Wilder : ఇస్లాం పట్ల మెతక వైఖరి వద్దు..ఉదయ్ పూర్ హత్య ఘటనపై డచ్ ఎంపీ



ఉద్ధవ్ థాక్రే రాజీనామాతో మహారాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ కు అనుచరులు మిఠాయిలు తినిపిస్తూ సంబరాలు చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబైలోని తాజ్ ప్రెసిడెంట్ హోటల్‌లో బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ నేతలంతా నిన్న రాత్రి సమావేశమయ్యారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Devendra Fadnavis, Eknath Shinde, Maharashtra

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు