అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం విశ్వ హిందూ పరిషత్ తన పోరాటాన్ని ఉద్ధృతం చేసింది. ఆలయ నిర్మాణం కోసం బిల్లును తీసుకురావాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధానిలో నిరసనకు దిగింది. ఇవాళ ఢిల్లీలో భారీ ర్యాలీని నిర్వహించనుంది.
మరోవైపు, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతారనే నమ్మకం తమకుందని ఆరెస్సెస్ తెలిపింది. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఈరోజు జరగనున్న భారీ సభలో ఆరెస్సెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు భయ్యాజీ జోషీ కీలక ప్రసంగం చేయనున్నారు. ఆయనతో పాటు వీహెచ్పీ అధ్యక్షుడు సదాశివ్ కోక్జే, అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ లు కూడా ప్రసంగించనున్నారు.
ఈ సందర్భంగా వీహెచ్పీ అధికార ప్రతినిధి వినోద్ భన్సాల్ మాట్లాడుతూ, ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు హాజరుకానున్నారని తెలిపారు. ఆలయం నిర్మాణానికి వ్యతిరేకంగా ఉన్నవారి మనసులను కూడా ఈ సభ మార్చబోతోందని చెప్పారు. మరికాసేపట్లో ఢిల్లీ రాంలాలీ మైదానం వేదికగా భారీ సభను నిర్వహించనున్నారు.
‘ధరమ్ సన్సద్’ పేరుతో చివరి సభను జనవరి 31, ఫిబ్రవరి 1 వతేదీల్లో ప్రయాగ్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశలకు ముందు భారీ ఎత్తున సభలు నిర్వహించి... బిల్లును ఆ సమావేశాల్లోనే ప్రవేశేపెట్టేలా డిమాండ్‌ను ఉధృతం చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నాయి హిందూత్వ సంఘాలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: National, National News, New Delhi, VHP