హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు..విజయం దిశగా ఆప్..కనిపించని లిక్కర్ స్కాం ప్రభావం

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు..విజయం దిశగా ఆప్..కనిపించని లిక్కర్ స్కాం ప్రభావం

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు..విజయం దిశగా ఆప్

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు..విజయం దిశగా ఆప్

ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ దూకుడు కనబరుస్తుంది. మొత్తం 250 స్థానాలకు గానూ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 125 ను కేజ్రీవాల్ పార్టీ క్రాస్ చేసింది. ఇప్పటి వరకు 130 స్థానాల్లో ఆప్ అభ్యర్థులు విజయం సాధించగా..స్పష్టమైన మెజారిటీ సాధించి విజయం దిశగా అడుగులు వేస్తుంది. బీజేపీ 97 స్థానాల్లో, కాంగ్రెస్ స్థానాలను సాధించింది. కాగా 15 ఏళ్లుగా బీజేపీ చేతిలో ఉన్న MCDని ఆప్ కైవసం చేసుకునే దిశగా వెళుతుంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ప్రభావం ఈ ఎన్నికలపై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో (Delhi Corporation Elections) ఆప్ దూకుడు కనబరుస్తుంది. మొత్తం 250 స్థానాలకు గానూ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 125 ను కేజ్రీవాల్ పార్టీ క్రాస్ చేసింది. ఇప్పటి వరకు 130 స్థానాల్లో ఆప్ (AAm Admi Party) అభ్యర్థులు విజయం సాధించగా..స్పష్టమైన మెజారిటీ సాధించి విజయం దిశగా అడుగులు వేస్తుంది. బీజేపీ 97 స్థానాల్లో, కాంగ్రెస్ స్థానాలను సాధించింది. కాగా 15 ఏళ్లుగా బీజేపీ చేతిలో ఉన్న MCDని ఆప్ కైవసం చేసుకునే దిశగా వెళుతుంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ప్రభావం ఈ ఎన్నికలపై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఇక గెలుపు దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Cm Kejriwal) ఇంటి వద్ద సందడి నెలకొంది.

రాజ్ భవన్ ముట్టడికి సీపీఐ యత్నం..కూనంనేని, చాడ అరెస్ట్..పరిస్థితి ఉద్రిక్తం

AAP gets majority, ends BJP's rule in Delhi civic body

Read @ANI Story | https://t.co/3gezk4fedX#AAP#MCDElections2022#DelhiMCDPolls#ArvindKejriwal#MCDPollspic.twitter.com/Bnpe5fTi2i

— ANI Digital (@ani_digital) December 7, 2022

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిగ్ ట్విస్ట్..ఏసీబీ కోర్టు తీర్పుపై హైకోర్టుకు సిట్

MCD చరిత్రలోనే తొలిసారి..

ఈ ఎన్నికల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. సుల్తాన్ పురి ఏ వార్డ్ లో ఆప్ తరపున పోటీ చేసిన ట్రాన్స్ జెండర్ బోబి విజయం సాధించారు. బోబి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి వరుణ్ థాకాపై 6714 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ విజయం పట్ల బోబి హర్షం వ్యక్తం చేశారు.

క్షేమంగా రావాలి బాబు..400 అడుగుల లోనున్న బోరుబావిలో పడిన 8ఏళ్ల బాలుడు

పంజాబ్ సీఎం హర్షం..

కాగా ఈ ఫలితాలపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనను కేజ్రీవాల్  (Cm Kejriwal)  కూకటివేళ్లతో పెకిలించారు. ఇప్పుడు MCDలో బీజేపీ పాలనకు కూడా తెరదించారు. విద్వేషపూరిత రాజకీయాలను ఢిల్లీ ప్రజలు కోరుకోవడం లేదని ఈ ఎన్నికలు చెబుతున్నాయి.

ఎగ్జిట్ పోల్స్ సర్వేలు..

అయితే ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా MCD పీఠం ఆప్ దే అని అంచనా వేశాయి. 15 ఏళ్ళు MCD బీజేపీ చేతిలో ఉండగా ఇప్పుడు ఆప్ వంతు అయింది. మొత్తం 250 స్థానాల్లో 155 స్థానాల్లో ఆప్ మెజారిటీ సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇప్పుడు ఆ అంచనాలను నిజం చేస్తూ..ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే మరికాసేపట్లో దీనికి సంబంధించి పూర్తి ఫలితాలను అధికారికంగా వెల్లడించనున్నారు.

First published:

Tags: AAP, Bjp, Delhi, Delhi news

ఉత్తమ కథలు