హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Kejriwal : మోదీ రెవ్డీ వ్యాఖ్యలకు కేజ్రీవాల్ స్ట్రాంగ్ కౌంటర్..దేశమంతా ఉచితంగా విద్య,ఆరోగ్య సేవలందిస్తా!

Kejriwal : మోదీ రెవ్డీ వ్యాఖ్యలకు కేజ్రీవాల్ స్ట్రాంగ్ కౌంటర్..దేశమంతా ఉచితంగా విద్య,ఆరోగ్య సేవలందిస్తా!

ఢి్ల్లీ సీఎం కేజ్రీవాల్

ఢి్ల్లీ సీఎం కేజ్రీవాల్

Kejriwal counter to modi revdi comments : ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లో రూ.14,850 కోట్ల వ్యయంతో నిర్మించిన 296 కిలోమీటర్ల బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి శనివారం ప్రధాని మోదీ(PM Modi) ప్రారంభించారు

ఇంకా చదవండి ...

Kejriwal counter to modi revdi comments : ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లో రూ.14,850 కోట్ల వ్యయంతో నిర్మించిన 296 కిలోమీటర్ల బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి శనివారం ప్రధాని మోదీ(PM Modi) ప్రారంభించారు. ఈ సందర్భంగా జలౌన్‌ జిల్లా ఒరారు మండలం కైతేరీ గ్రామంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోడీ ప్రసంగిస్తూ...ఉచిత హామీలు దేశ అభివృద్ధికి విఘాతం క‌లిగిస్తాయ‌ని అన్నారు. ఉచిత పథకాల(Free Bees) హామీలిచ్చి ఓట్లు అడిగే సంస్కృతి దేశానికి చాలా ప్రమాదకరమని అన్నారు. ముఖ్యంగా యువత తాయిలాల సంస్కృతిపై అప్రమత్తంగా ఉండాలని,ఇలాంటి హామీల వ‌ల‌లో ప‌డ‌వ‌ద్ద‌ని సూచించారు. ఉచిత హామీల‌ని ఉత్త‌రాది స్వీట్ రెవ్ది(Revdi)తో పోల్చారు. తమ ప్రభుత్వం సౌకర్యాలు కల్పించడమే కాకుండా దేశ భవిష్యత్‌ను నిర్మిస్తోందని మోదీ అన్నారు.

మోదీ వ్యాఖ్య‌ల‌పై ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) దీటుగా స్పందించారు. ఉచిత విద్య‌, వైద్యం తాయిలాలు కాద‌ని స్పష్టం చేశారు. ఉచిత విద్య, ఆరోగ్యం, విద్యుత్ వంటి ప్రభుత్వ పథకాలు ఉచితాలుగా (Freebies) భావించ రాదని, ప్రపంచంలోనే దేశాన్ని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దేంచుకు పునాదులని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలోని 18 ల‌క్ష‌ల మంది విద్యార్ధులు ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో చ‌దువుతున్నార‌ని వారికి ఉచిత నాణ్య‌మైన విద్య‌ను అందిస్తున్నాన‌ని కేజ్రీవాల్ పేర్కొన్నారు. వారికి ఉచిత విద్య అందించ‌డం తాను చేసిన నేర‌మా అని ఆప్ చీఫ్ నిల‌దీశారు. 1947,1950 ల్లోనే ఇవ‌న్నీ చేసి ఉండాల్సింద‌న్నారు. మిత్రులు తీసుకున్న వేల కోట్ల రూపాయల రుణాలు రద్దు చేయడం, విదేశీ పర్యటనలు చేస్తూ వేల కోట్ల కాంట్రాక్టులు మిత్రులకు కట్టబెట్టడం ఉచితాల లెక్కల్లోకి వస్తాయి అని నేరుగా ప్రధాని పేరును ప్రస్తావించకుండా కేజ్రీవాల్ విమర్శించారు. త‌న‌ను విమ‌ర్శిస్తున్న‌వారు త‌మ కోసం ఏకంగా విమానాలు, ప్రైవేట్ జెట్‌లు కొనుగోలు చేసేందుకు వేలాది కోట్లు వెచ్చిస్తున్నార‌ని ప్రధానినుద్దేశించి కేజ్రీవాల్ విమర్శించారు. కేజ్రీవాల్ త‌న కోసం విమానాలు కొనుగోలు చేయ‌లేద‌ని, ఢిల్లీలో తాను ప‌లు ఉచిత ప‌ధ‌కాలు అమలు చేస్తున్నా త‌మ బ‌డ్జెట్ లాభాల బాట‌లో ఉంద‌ని పేర్కొన్నారు. తాను ఈ విష‌యం చెప్ప‌డం లేద‌ని కాగ్ తాజా నివేదికే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. ఫరిస్తే స్కీమ్ ద్వారా ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో ట్రీట్మెంట్ అందించడం ద్వారా తమ ప్రభుత్వం 13,000 మంది ప్రాణాలను కాపాడిందని, తాము రెవ్దిలు పంచిపెట్టామా అనేది వారి కుటుంబాలను అడిగితే తెలుస్తుందని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రులలో తాము ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందిస్తామని, ఇది ఉచిత రెవ్డి పాలిటిక్స్ అంటారా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

Insufficient sleep : తక్కువ సమయం నిద్రపోతే గుండె జబ్బులు!

ఉచిత రెవ్ది అంటే...వివిధ బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్న ఒక పెద్ద కంపెనీ ఆ రుణాలను బ్యాంకులకు ఎగ్గొట్టి ఆ కంపెనీ ఒక రాజకీయ పార్టీకి కొన్ని కోట్ల విరాళం ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఆ కంపెనీపై ఎటువంటి చర్య తీసుకోదు. ఇది ఉచిత రెవ్డి. మీ స్నేహితుల వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తే అదే ఉచిత రెవ్డి అని మోదీనుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ సీఎం. దేశంలో ఇవాళ రెండురకాల రాజకీయాలు నడుస్తున్నాయని, ఒకటి నిజాయితీతో కూడిన రాజకీయాలు, రెండవది అవినీతి రాజకీయాలు అని కేజ్రీవాల్ అన్నారు. భగవంతుడు తనకు అవకాశం ఇస్తే దేశమంతటా ఉచిత విద్య, ఉచిత ఆరోగ్య సేవలు అందిస్తానని చెప్పారు. ఇక,రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వాలని ఆప్ నిర్ణయించింది

First published:

Tags: Aravind Kejriwal, Pm modi

ఉత్తమ కథలు