హోమ్ /వార్తలు /జాతీయం /

చచ్చిన గుర్రాన్ని మళ్లీ కొడుతున్నారు : రాఫెల్ డీల్‌పై నిర్మలా సీతారామన్

చచ్చిన గుర్రాన్ని మళ్లీ కొడుతున్నారు : రాఫెల్ డీల్‌పై నిర్మలా సీతారామన్

నిర్మలా సీతారామన్ (ఫైల్ ఫొటో)

నిర్మలా సీతారామన్ (ఫైల్ ఫొటో)

చచ్చిన గుర్రాన్ని మళ్లీ కొడుతున్నారని.. రాఫెల్ డీల్‌పై ఆయా సందర్బాల్లో పీఎంవో కార్యాలయం సమాచారం అడగడాన్ని ప్రత్యక్ష జోక్యంగా భావించరాదని నిర్మలా సీతారామన్ అన్నారు.

  రాఫెల్ డీల్ వ్యవహారంలో ఫ్రాన్స్‌తో పీఎంవో కార్యాలయ జోక్యంపై జాతీయ మీడియాలో ప్రచురితమైన ఓ సంచలనాత్మ కథనంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు.ఆరోపణలను ఖండించిన సీతారామన్.. డీల్‌కు సంబంధించి పీఎంవో కార్యాలయం నుంచి సమాంతర సంప్రదింపులు జరిగాయనడం సరికాదన్నారు.


  రాఫెల్ ఒప్పందాన్ని కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోందని.. రక్షణ శాఖ పంపిన నోటీసుకు అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ బదులు ఇచ్చారని చెప్పారు.రాఫెల్ డీల్‌పై జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాల‌న్న విపక్షాల డిమాండ్‌ను ఆమె తప్పు పట్టారు. మల్టీ నేషనల్ కంపెనీలు, స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రతిపక్షాలు దీనిపై అనవసర రాద్దాంతానికి తెరలేపాయని అన్నారు.


  చచ్చిన గుర్రాన్ని మళ్లీ కొడుతున్నారని.. రాఫెల్ డీల్‌పై ఆయా సందర్బాల్లో పీఎంవో కార్యాలయం సమాచారం అడగడాన్ని ప్రత్యక్ష జోక్యంగా భావించరాదని అన్నారు. ఫ్రాన్స్ కార్యాలయంతో పీఎంవో జోక్యంపై అప్పటి రక్షణమంత్రి మనోహర్ పారికర్ విభేదించారన్న ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. అంతా సవ్యంగానే జరుగుతోందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పారికర్ ఆ సమయంలో రక్షణ శాఖ లేఖకు బదులిచ్చారని, అంతే తప్ప ఇంకేమి లేదని చెప్పారు.

  First published:

  Tags: New Delhi, Nirmala sitharaman, Rafale Deal

  ఉత్తమ కథలు