హోమ్ /వార్తలు /national /

Dalit Bandhu: మరో నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలు.. ఏ జిల్లాల్లో అంటే..

Dalit Bandhu: మరో నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలు.. ఏ జిల్లాల్లో అంటే..

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Dalith Bandhu: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దళిత బంధు(Dalitha Bandhu) పథకం అమలుకు మరో నాలుగు జిల్లాలను ఎంపిక చేశారు. ఈ నాలుగు జిల్లాల్లో దళిత శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో నాలుగు మండలాలను కేసీఆర్ ఎంపిక చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

దళితబంధు(Dalit Bandhu) పథకాన్ని ఒక ఉద్యమంలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా కింద హుజూరాబాద్ (Huzurabad) లో దళితబంధు పథకాన్ని ముందు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో దళితబంధు పథకం అమలు యొక్క లోటు పాట్లను, దళిత  ప్రజల యొక్క మనోభావాలను, వారి అవసరాలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా.. రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ భాగాల్లో ఉన్న, దళిత శాసన సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాలను ఎంపిక చేసి ఆ మండలాల్లో అన్ని కుటుంబాలకు హుజూరాబాద్ తో పాటు దళితబంధును అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

దీనిలో తెలంగాణలోని  ఏ జిల్లాలు(Districts) ఉన్నాయంటే.. ఖమ్మం (Khammam) జిల్లా మధిర(Madhira) నియోజకవర్గంలోని చింతకాని(Chintakarni) మండలం,  సూర్యాపేట(Suryapeta) జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గంలోని తిర్మలగిరి మండలం, నాగర్ కర్నూలు(Nagar kurnool) జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గంలో చారొగాం మండలం, కామారెడ్డి(kamareddy) జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలో నిజాంసాగర్(Nizam Sagar) మండలాలను కేసీఆర్ ఎంపిక చేశారు.

ఇది చదవండి: అక్టోబర్​ నుంచి అమల్లోకి నూతన వేతన కోడ్.. వారానికి 3 రోజుల సెలవు.. పనివేళల్లో భారీ మార్పులు..

ఈ  నాలుగు మండలాల్లో ఉణ్న మొత్తం దళిత కుటుంబాలకు వెంటనే దళిత బంధు(Dalit bandhu) పథకాన్ని ప్రభుత్వం(Government) వర్తింపచేస్తుంది. సిఎం కెసిఆర్(KCR) ఢిల్లీ(Delhi) పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయా జిల్లాల మంత్రులు(Ministers), ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్ లో సమీక్షా సమావేశాన్ని సిఎం నిర్వహించనున్నారు.

ఇది చదవండి: ఈ స్కీమ్ వాళ్లకు మంచి పెట్టుబడి మార్గం.. పథకం అర్హత, ప్రయోజనాలు ఇవే..

ఆ సమావేశంలో నిర్ణయాలు తీసుకుని ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేయనున్నారు. ఇదిలా ఉండగా..రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత గిరిజనులందరికీ ఇంటింటికీ  దళితబంధు ఇవ్వాలని డిమాండ్లు ఎక్కువ అవుతున్నాయి.

ఇది చదవండి: వృద్ధురాళ్లపై లైంగిక దాడి.. నిందితుల్లో ఒకరికి 22 ఏళ్లు.. మరొకరికి 32 ఏళ్లు..

అన్ని నియోజకవర్గాలలో దళిత గిరిజన కుటుంబాలకు కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున అందించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.  లేదంటే తమ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు(MLA) రాజీనామా చేయాలనే డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఉప ఎన్నికలు(Elections) వస్తే  ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తుంది కాబట్టి అందరూ  ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లాలని అంటున్నారు నాయకులు.

హుజురాబాద్ (Huzurabad) నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ (Etala Rajender) రాజీనామా చేసిన దగ్గర నుంచి అక్కడ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా దళితబంధు పథకాన్ని అమలు చేసిన కేసీఆర్.. తాజాగా ఆ పథకానికి ఇటీవల రూ. 500 కోట్లు కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఈ పథకం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రతీ దళిత కుటుంబసభ్యులు కోరుతున్నారు. ఈటల వ్యావహారం మూలంగానే కేసీఆర్ దళితులను ఆదుకునే దిశగా అడుగులు వేశారని.. లేదంటే ఈ పథకం అస్సలు ఉండేది కాదనేది ప్రతిపక్ష నాయకుల వాదన. ఏదేమైనా దళితబంధు అమలుకు మరో నాలుగు మండలాలు ఎంపిక చేయడంతో ఆ మండలాల దళిత వర్గం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: CM KCR, Dalitha Bandhu, Eetala rajender, Huzurabad By-election 2021

ఉత్తమ కథలు