హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

నా గుండెల్ని చీల్చి చూస్తే, అందులో మోదీ ఉంటారంటున్న బీజేపీ ప్రత్యర్థి

నా గుండెల్ని చీల్చి చూస్తే, అందులో మోదీ ఉంటారంటున్న బీజేపీ ప్రత్యర్థి

ప్రధాని నరేంద్ర మోదీ (Image; ANI)

ప్రధాని నరేంద్ర మోదీ (Image; ANI)

‘నాకు ప్రధాని మోదీ ఫొటోలు అక్కర్లేదు. హనుమంతుడి గుండెల్లో రాముడు ఉన్నట్టు నా గుండెల్లో నరేంద్ర మోదీ ఉంటారు. నా గుండెను చీల్చి చూస్తే అందులో మీకు మోదీ కనిపిస్తారు.’ అని ప్రకటించారు.

  ‘నా గుండెల్ని చీల్చి చూడండి. అందులో ప్రధాని నరేంద్ర మోదీ ఉంటారు.’ ఈ మాటలు అంటున్నది ఎవరో బీజేపీ నేత కాదు. కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీరాభిమాని. ఆయన లోక్ జనశక్తి పార్టీ నేత, రెండు సార్లు ఎంపీగా గెలిచిన చిరాగ్ పాశ్వాన్. ఆయన ఇటీవల మరణించిన కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడే ఈ చిరాగ్ పాశ్వాన్. ఇటీవల ఆయన బీహార్‌లో ఎన్డీయే నుంచి తప్పుకొన్నారు. బీజేపీ, జేడీయూ కలసి పోటీ చేస్తుంటే, ఎల్జీపీ మాత్రం అందులో నుంచి తప్పుకొంది. దీంతో లోక్ జనశక్తి పార్టీని 'ఓట్లు చీల్చే పార్టీ'గా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ అభివర్ణించారు. బీజేపీ ఇస్తానన్న సీట్ల కన్నా ఎల్‌జేపీ ఎక్కువ సీట్లు కోరుకుందని, ఆ తర్వాత ఎన్డీయే నుంచి వైదొలిగిందని చెప్పారు. ఎల్జేజేపీ ఓట్లు చీల్చే పార్టీ అని, బీహార్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఎల్జేపీ కోరుకోవడం లేదని అన్నారు. దీంతోపాటు ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటోను వాడుకోవడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, తనను తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హనుమంతుడిలా అభివర్ణించారు చిరాగ్ పాశ్వాన్.

  ‘నాకు ప్రధాని మోదీ ఫొటోలు అక్కర్లేదు. హనుమంతుడి గుండెల్లో రాముడు ఉన్నట్టు నా గుండెల్లో నరేంద్ర మోదీ ఉంటారు. నా గుండెను చీల్చి చూస్తే అందులో మీకు మోదీ కనిపిస్తారు.’ అని ప్రకటించారు. ప్రధాని మోదీ ఫొటో పెట్టుకోవాల్సిన అవసరం తనకు లేదని, బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు ఉందని చెప్పారు. నితీష్ కుమార్ అపనమ్మకంతో ఉన్నారని చెప్పారు.

  చిరాగ్ పాశ్వాన్ (Image; ANI)

  గత వారం చిరాగ్ పాశ్వాన్ తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ చనిపోయారు. అయితే, కనీసం నితీష్ కుమార్ తనకు సంతాపం కూడా తెలపలేదని చిరాగ్ ఆరోపించారు. ‘రామ్ విలాస్ పాశ్వాన్ పార్ధివదేహం ఢిల్లీ నుంచి విమానంలో పాట్నా వచ్చింది. నితీష్ కుమార్ కూడా విమానాశ్రయంలో ఉన్నారు. కానీ, నన్ను ఏ మాత్రం పట్టించుకోలేదు. నేను ఆయన పాదాలకు నమస్కరించా. కానీ, నితీష్ నన్ను పట్టించుకోలేదు. అది అందరూ చూశారు. మన వ్యక్తిగత కారణాల వల్ల కొన్నిసార్లు కనీస మర్యాదలు కూడా పాటించకపోవడం దారుణం.’ అని చిరాగ్ పాశ్వాన్ అన్నారు. తన తండ్రి చనిపోయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు బీహార్ సీఎం నితీష్ కుమార్ తనతో గానీ, తన కుటుంబంతో కానీ ఒక్కమాట కూడా మాట్లాడలేదని చెప్పారు. నితీష్, రామ్ విలాస్ పాశ్వాన్ ఇద్దరూ సీనియర్ సహచరులని, కనీసం ఆ మర్యాద కూడా పాటించలేదని చిరాగ్ ఆరోపించారు.

  ‘నాన్న చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ నన్ను పలకరించారు. అమ్మకు ధైర్యం చెప్పారు. నాన్న చనిపోయిన రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత రోజు నేరుగా వచ్చారు. నా భుజాల మీద చేతులు వేశారు. అలా చాలా సేపు ఉన్నారు. నాకు ఇంకా ఆ ఘటన గుర్తుంది. కానీ, నితీష్ కుమార్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు.’ అని చిరాగ్ పాశ్వాన్ అన్నారు.

  పాట్నా విమానాశ్రయంలో ఘటన తర్వాత రెండుసార్లు తాను నితీష్ కుమార్‌ను కలిశానని, అసెంబ్లీలో కనీసం తన కళ్లలో కళ్లు పెట్టి కూడా చూడలేదన్నారు. ఆ తర్వాత సంతాపం సభలో తాను వెళ్లి నితీష్ కుమార్ దగ్గర చేతులు కట్టుకుని నిలబడ్డానని, ఆ సమయంలో తాను ఎంతో భావోద్వేగానికి గురయ్యానని, అయినా కూడా బీహార్ సీఎం కనీసం స్పందించలేదన్నారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Bihar Assembly Elections 2020, Bjp, Nitish Kumar, Pm modi

  ఉత్తమ కథలు