హోమ్ /వార్తలు /national /

మళ్లీ తెరపైకి అమరావతి వివాదం.. ప్రజల్ని రెచ్చగొడతారా అంటూ సీపీఐ లేఖ

మళ్లీ తెరపైకి అమరావతి వివాదం.. ప్రజల్ని రెచ్చగొడతారా అంటూ సీపీఐ లేఖ

అమరావతి ఆందోళనలు (File)

అమరావతి ఆందోళనలు (File)

Amaravati | అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అధారిటీ కమిషనర్ కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు.

  అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అధారిటీ కమిషనర్ కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. కరోనా విపత్కర పరిస్థితి, లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో అమరావతి రైతుల నుంచి అభ్యంతరాలు ఎలా స్వీకరిస్తారని ప్రశ్నించారు. ‘అమరావతిలో పలు భూ వినియోగ జోన్ల నుంచి ఆర్5 రెసిడెన్షియల్ జోన్లోకి మార్చేందుకు రైతుల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభ్యంతరాలు సీఆర్డీఏ కోరినట్లు తెలుస్తోంది. రైతులకు అంత సాంకేతిక పరిజ్ఞానం ఎలా సాధ్యం?. లాక్ డోన్ నేపథ్యంలో సాంకేతికత ఎలా అందుబాటులో ఉంటుంది?. ప్రజలను రెచ్చగొట్టేందుకే మీరు ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఉంది.

  తక్షణమే వీడియో కాన్ఫరెన్స్ రద్దు చేయండి.’ అని రామకృష్ణ లేఖలో డిమాండ్ చేశారు. గతంలో వలే గ్రామసభల ద్వారా రైతుల నుంచి స్వయంగా అభ్యంతరాలు, సూచనలు సేకరించాలని రామకృష్ణ కోరారు.

  ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. విశాఖలో సెక్రటేరియట్, కర్నూలులో హైకోర్టు, అమరావతిలో రాజ్‌భవన్, అసెంబ్లీ ఉంటాయని చెప్పారు. అయితే, అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు 110 రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ వ్యాప్తించడంతో కేంద్రం లాక్ డౌన్ ప్రకటించింది. అయినా, రైతులు సామాజికదూరం పాటిస్తూ కొన్నిచోట్ల నిరసనలు తెలుపుతున్నారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Amaravati, Andhra Pradesh, Ap capital, Crda

  ఉత్తమ కథలు