డ్రగ్స్, ఈడీ కేసులను ప్రస్తావిస్తూ కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సిటీ సివిల్ కోర్టు రేవంత్ రెడ్డిని ఆదేశించింది. ఈ మేరకు ఇన్‌జంక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. కేటీఆర్ దాఖలు చేసిన పరువునష్టం కేసుపై విచారణ చేపట్టిన కోర్టు.. రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 20కు వాయిదా వేసింది. డ్రగ్స్ కేసుతో ముడిపెడుతూ రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించారని ఆరోపిస్తూ నిన్న రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ పరువునష్టం దావా వేశారు. తప్పుడు ఆరోపణలను పరువునష్టం చర్యలుగా పరిగణించి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పేలా రేవంత్ రెడ్డిని ఆదేశించాలని సిటీ సివిల్ కోర్టును కోరారు. పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల ద్వారా క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలన్నారు. తన పరువుకు భంగం కలిగించేలా చేసిన వ్యాఖ్యలను ట్విటర్, ఫేస్‌బుక్, ఇతర సామాజిక మాధ్యమాల నుంచి తొలగించేలా రేవంత్‌ను ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. ఈడీ డ్రగ్స్ కేసుతో ముడిపెడుతూ తనపై తప్పుడు, పరువునష్టం వ్యాఖ్యలు చేయకుండా రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులను నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్‌లో కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉంటే కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. దీంతో రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. పోలీసుల జోక్యంతో టీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టారు. ఇరు వర్గాలు కర్రలు , రాళ్లు విసురుకున్నారు.
ఇటీవల రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య డ్రగ్స్ విషయంలో మాటల యుద్ధం కొనసాగుతోంది. నగరంలో డ్రగ్స్ విచ్చవిడిగా అమ్మడంతో పాటు మంత్రి కేటీఆర్‌కు డ్రగ్స్ మాఫితో సంబంధాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇద్దరి మధ్య ట్వీట్టర్ వేదికగా మాటల యుద్దం కొనసాగింది. ఇద్దరు నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు.
ముఖ్యంగా రేవంత్ రెడ్డి వైట్ చాలెంజ్ పేరుతో మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. గన్‌పార్క్ వద్ద తాను పరీక్షలకు సిద్దంగా ఉంటానని సవాల్ విసిరారు. చెప్పినట్టుగా గన్‌పార్క్ వద్దకు చేరుకున్న రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
Telangana: ఇటు కాంగ్రెస్.. అటు బీజేపీ.. బ్యాలెన్స్ చేస్తున్న మాజీ ఎంపీ.. టార్గెట్ ఆ నాయకుడే..
YS Jagan: ఏపీ కేబినెట్‌లో మార్పులు చేర్పులు.. వారిచ్చే నివేదికలే సీఎం జగన్‌కు కీలకమా ?
అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్ తాను ఏ పరీక్షలైనా సిద్దమేనని స్పష్టం చేశారు. అయితే తనతోపాటు ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ కూడా శాంపిల్స్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జైలుకు వెళ్లివచ్చిన వారితో తాను సిద్దంగా లేనని చెప్పడంతో పాటు ఆయన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు సైతం వెళ్లారు. తనపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై బేషరుతుగా క్షమాపణ చెప్పేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. అంతకుముందు సినిమా ఇండస్ట్రీకి పరిమితమైన డ్రగ్స్ వ్యవహారం రేవంత్ రెడ్డి ఆరోపణలతో ఒక్కసారిగా రాజకీయ నాయకుల వైపు మళ్లింది. ఇరు పార్టీల మధ్య రాజకీయ ఉద్రిక్తతలను పెంచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Drugs case, KTR, Revanth Reddy, Telangana