హోమ్ /వార్తలు /national /

Couple Death: హోలీ ఆడాక.. రంగులు కడిగేందుకు బాత్‌రూంలోకి వెళ్లి భార్యభర్తలు మృతి..!

Couple Death: హోలీ ఆడాక.. రంగులు కడిగేందుకు బాత్‌రూంలోకి వెళ్లి భార్యభర్తలు మృతి..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హోలీ ఆడాక... బాత్ రూంలోకి వెళ్లిన భార్య భర్తలు మృతి చెందిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. బాత్‌రూమ్‌లోకి వెళ్లిన తల్లిదండ్రులు గంట అయినా కూడా బయటకు  రాలేదు.

  • Local18
  • Last Updated :
  • Hyderabad, India

దేశ వ్యాప్తంగా హోలీ వేడుకల్ని ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. పిల్ల, పెద్ద అంతా కూడా రంగుల్లో మునిగి తేలారు. కులాలు, మతాలకు అతీతంగా ప్రతీ ఏడాది కూడా హోలీ సంబరాలు ఘనంగా మనదేశం జరుపుకుంటూ ఉంటుంది. గత కొన్నాళ్లుగా కరోనా కారణంగా హోలీ సెలబ్రేషన్స్ బాగా చేసుకోలేకపోయారు  ప్రజలు. అయితే ఈ ఏడాది మాత్రం అంతా ... సరదాగా సంబరాల్లో మునిగి తేలారు. అయితే ఓ కుటుంబంలో హోలీ విషాదం నింపింది. హోలీ ఆడాక... బాత్ రూంలోకి వెళ్లిన భార్య భర్తలు మృతి చెందిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ షాకింగ్ సంఘటన జరిగింది. మురాద్‌నగర్‌లోని అగ్రసేన్ విహార్ ఫేజ్ వన్ కాలనీకి చెందిన 40 ఏళ్ల దీపక్‌ గోయల్‌, 36 ఏళ్ల భార్య శిల్పి తమ పిల్లలతో కలిసి బుధవారం హోలీ  వేడుక ఎంతో ఆనందంగా జరుపుకున్నారు.  అయితే ఆ తర్వత దుస్తులు, శరీరానికి అంటిన రంగులను శుభ్రం చేసుకునేందుకు భార్యాభర్తలు కలిసి బాత్‌రూమ్‌లోకి వెళ్లారు.

అయితే  బాత్‌రూమ్‌లోకి వెళ్లిన తల్లిదండ్రులు గంట అయినా కూడా బయటకు  రాలేదు. దీంతో పిల్లలకు అనుమానం వచ్చి ఇరుగు పొరుగు వారి సహాయంతో బాత్‌రూమ్‌ డోర్‌ పగులగొట్టి చూశారు. లోపల అచేతనంగా పడి ఉన్న వారిద్దరినీ వెంటనే  ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ దంపతులు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

పోస్ట్‌మార్టం కోసం దంపతుల మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. గీజర్‌ నుంచి లీకైన గ్యాస్‌ వల్ల ఊపిరాడక ఆ దంపతులు చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వచ్చిన తర్వాత భార్యాభర్తల మరణానికి కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పిల్లలతో పాటు, చుట్టుపక్కల వారిని కూడా విచారించి వివరాలు సేకరిస్తున్నారు.

First published:

Tags: Couple died, Up news, Uttar pradesh

ఉత్తమ కథలు