హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

భారత్‌కు మద్దతిస్తున్న దేశాలపై క్షిపణి దాడి... పాకిస్తాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

భారత్‌కు మద్దతిస్తున్న దేశాలపై క్షిపణి దాడి... పాకిస్తాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఇమ్రాన్ ఖాన్, నరేంద్ర మోదీ

ఇమ్రాన్ ఖాన్, నరేంద్ర మోదీ

పాకిస్తాన్‌కు చెందిన నైలా ఇనాయత్ అనే జర్నలిస్ట్ మంత్రి వ్యాఖ్యల్లో కొంత భాగాన్ని వీడియో రూపంలో ట్వీట్ చేశారు. దీంతో కాశ్మీర్ సమస్యపై గండపూర్ వ్యాఖ్యలు పాకిస్తాన్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా వేడి రాజేశాయి.

పాకిస్తాన్ మంత్రి మరోసారి భారత్‌ను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ సమస్యపై భారత్‌కు మద్దతు ఇచ్చే ఏ దేశమైనా సరే వాటిపై పాకిస్తాన్ మిసైల్ దాడి తప్పదని హెచ్చరించారు. అలాంటి దేశాల్ని పాక్ తన "శత్రువు" గా పరిగణిస్తుందని పాకిస్తాన్ మంత్రి మరోసార వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "కాశ్మీర్‌పై భారత్‌తో ఉద్రిక్తతలు పెరిగితే, పాకిస్తాన్ యుద్ధానికి వెళ్ళవలసి వస్తుంది. అందువల్ల, భారతదేశానికి మద్దతు ఇచ్చే దేశాలు మన శత్రువుగా పరిగణించబడతాయన్నారు. భారతదేశంపై మిసైల్ దాడి జరుగుతుందన్నారు. ఆ దేశాలు దీనికి మద్దతు ఇస్తాయన్నారు. మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కాశ్మీర్ వ్యవహారాల మంత్రి గిల్గిత్ బాల్టిస్తాన్ అలీ అమిన్ గండపూర్ ఈ వ్యాఖ్యాలు  చేశారు.

పాకిస్తాన్‌కు చెందిన నైలా ఇనాయత్ అనే జర్నలిస్ట్ మంత్రి వ్యాఖ్యల్లో కొంత భాగాన్ని వీడియో రూపంలో ట్వీట్ చేశారు. దీంతో కాశ్మీర్ సమస్యపై గండపూర్ వ్యాఖ్యలు పాకిస్తాన్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.  ఈ విషయంపై పలు దేశాలు ఆయన తీరుపై దుమ్మెత్తి పోస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలను ఇచ్చిన ఆర్టికల్ 370 ను రద్దు చేయాలన్న దానిపై పాక్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.

జమ్ముకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు అనేది తన అంతర్గత విషయమని భారత్ ఇప్పటికే పేర్కొంది. ఈ వైఖరికి సార్క్ దేశాలు, సౌదీ అరేబియాతో పాటు అనేక దేశాలు మద్దతు ఇచ్చాయి. సెప్టెంబరులో న్యూయార్క్‌లో జరిగిన యుఎన్ జనరల్ అసెంబ్లీలో తన తొలి ప్రసంగంలో, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కాశ్మీర్‌పై తన 50 నిమిషాల ప్రసంగాన్ని చేసి.. భారత వ్యతిరేక చర్యలకు పూనుకున్నారు. ఆ సమయంలో కూడా ఇమ్రాన్ ఖాన్ భారత్‌తో అణు యుద్ధం తప్పదంటూ వ్యాఖ్యలు చేస్తూ... వేడి రాజేశారు. మరి తాజాగా పాక్ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా దేశాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి.

First published:

Tags: Imran khan, India pakistan, India VS Pakistan, Narendra modi, Pakistan army, Pm modi

ఉత్తమ కథలు