Navneet Rana Challenges Uddhav Thackeray : టాలీవుడ్ మాజీ హీరోయిన్, ప్రస్తుత అమరావతి(మహారాష్ట్ర) ఎంపీ నవనీత్ కౌర్ రాణా కొద్దిరోజులుగా వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటున్నారు. ఎంపీగా ఆమె, ఎమ్మెల్యేగా భర్త రవి రాణా గెలిచింది ఇండిపెండెంట్లుగానే అయినా ఇప్పుడు అనధికార బీజేపీ అనుబంధ సభ్యులుగా.. అధికార శివసేనను ఢీకొడుతున్నారు. తాజాగా అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు. దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని మహారాష్ట్ర(Maharashtra) సీఎం ఉద్దవ్ ఠాక్రేకు నవనీత్ కౌర్ సవాల్ విసిరారు.
హనుమాన్ చాలీసా వివాదంలో అరెస్టై, విడుదలైన నవనీత్ కౌర్...రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచైనా సరే తనపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని..మహిళా శక్తి అంటే ఏంటో ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray)కు చూపిస్తామని అన్నారు. తాను ఏ తప్పు చేశానని జైళ్లో పెట్టారని ఆమె ప్రశ్నించారు. హనుమాన్ చాలీసా చదవడం తప్పా అని ఆమె నిలదీశారు. హనుమాన్ చాలీసా చదవడమే నేరమైతే 14 రోజులు కాదు 14 ఏళ్లు జైల్లో ఉంటాను అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై తీవ్ర విమర్శలు చేశారు. నవనీత్ కౌర్. రెండు వారాల క్రితం థాకరే నివాసం మాతో శ్రీ ముందు హనుమాన్ చాలీసా చదివేందుకు యత్నించారనే ఆరోపణలతో నవ్‌నీత్, ఆమె భర్త రవి రానాను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
ALSO READ OMG : ఊడిపోయిన పురుషాంగం..ఆరేళ్లుగా చేతితో పట్టుకొని తిరిగాడు..చివరికి
నవనీత్ రాణా దంపతులు ఉద్దేశపూర్వకంగా ఇరు వర్గాల మధ్య శత్రుత్వాన్ని సృష్టిచేందుకు ప్రయత్నించారనే కారణంగా ఈ అరెస్టులు జరిగాయి. ఐపీసీ, ముంబై పోలీస్ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఖర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 12 రోజుల వరకూ వారికి బెయిల్ రాలేదు. ఇటీవల బెయిల్ పై విడుదలయ్యారు. బెయిల్‌పై విడుదలైన నవనీత్ ముంబైలోని లీలావతి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందారు. డిశ్చార్జి అయిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు సీఎం ఉద్దవ్ కు సవాల్ విసిరారు ఇక,.శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ను చిలుకగా అభివర్ణించిన నవనీత్ కౌర్ ఆయనపై ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravati, Maharastra, Uddhav Thackeray