హోమ్ /వార్తలు /national /

Telangana: ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్నా కేసీఆర్​ అవినీతి కనిపించలేదా?  బీజేపీపై కాంగ్రెస్​ సీనియర్​ నేత ఫైర్​

Telangana: ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్నా కేసీఆర్​ అవినీతి కనిపించలేదా?  బీజేపీపై కాంగ్రెస్​ సీనియర్​ నేత ఫైర్​

పొన్నాల లక్ష్మయ్య (ఫైల్​)

పొన్నాల లక్ష్మయ్య (ఫైల్​)

తెలంగాణ సీఎం కేసీఆర్​, బీజేపీ నాయకులపై టీపీసీసీ మాజీ చీఫ్​, సీనియర్​ కాంగ్రెస్​ నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శలు గుప్పించారు. కేసీఆర్​ అవినీతి చిట్టా బీజేపీ వాళ్ల దగ్గర ఉందని అంటున్నారని మరి ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు.

తెలంగాణ (Telangana) సీఎం కేసీఆర్​, బీజేపీ నాయకులపై టీపీసీసీ మాజీ చీఫ్​, సీనియర్​ కాంగ్రెస్​ నేత పొన్నాల లక్ష్మయ్య (TPCC Former Chief, Senior congress leader Ponnala Lakshmaiah) విమర్శలు గుప్పించారు. కేసీఆర్​ అవినీతి చిట్టా (Corruption allegations) బీజేపీ వాళ్ల దగ్గర ఉందని అంటున్నారని మరి ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. బిల్లును పాస్​ చేయించుకోవడానికే దాస్తున్నారా? అంటూ ఆరోపణలు గుప్పించారు. అదే విధంగా మోదీ చిట్టా (Modi Corruption) కూడా తన వద్ద ఉందని కేసీఆర్ (KCR)​ చెబుతున్నారని ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఆ విషయాలు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. ఈ మేరకు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ..  రాజకీయాలు వేడెక్కుతున్నాయి.. రాజకీయాలు వేడెక్కితే పర్వాలేదు. కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రభుత్వ నాయకులు వాస్తవాలను వాస్తవాలుగా సమాచారాన్ని ప్రజల ముందు ఉంచాలి. తెలంగాణ (Telangana) రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రధాని నరేంద్ర మోదీ బండారం బయటపెడతానని వ్యాఖ్యానించారు. మోదీ అవినీతి చిట్టా  (Corruption allegations)  ని బయటపెడతానని అంటున్న కేసీఆర్ అంతకుముందు రోజు జరిగిన బహిరంగ సభలో ఎందుకు మాట్లాడలేదు.

ప్రజా వ్యతిరేక చట్టాలను ఆమోదముద్ర వేసుకోవడానికి..

ఈ వాస్తవాలను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఎందుకు బయట పెట్టడం లేదు..?

మరుగున పెట్టడం కూడా నేరమే (Crime) కదా ? ( పదవి లో ఉండి ). కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా , బండి సంజయ్, కిషన్ రెడ్డిలు తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి చిట్టా మా దగ్గర ఉందని చెబుతున్నారు.కాళేశ్వరం, మిషన్ భగీరథ, విద్యుత్ కొనుగోలు అన్నిటిలో అవినీతి ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఎనిమిది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉంటున్నా బీజేపీ నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ అవినీతి చిట్టాని ఎందుకు దాస్తున్నారు ? అవినీతి చిట్టా ను అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావడానికి ప్రజా వ్యతిరేక చట్టాలను చర్చ లేకుండా ఆమోదముద్ర వేసుకోవడానికి , భయపెట్టడానికి బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తోందని స్పష్టంగా అర్థం అవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్​ పై 2014 ఏప్రిల్ 14వ తేదీన సీబీఐ కోర్టు చార్జిషీటు వెయ్యమని చెప్పింది కదా. వేశారా..? కేంద్ర ప్రభుత్వ ఈడీ అధికారులు వచ్చి ప్రశ్నించిన మాట వాస్తవం కాదా కేసీఆర్..?

సీబీఐ స్వచ్ఛందంగా ఈ కేసును తీసుకోకూడదా?..

దేశంలో బీజేపీ ప్రతిష్ట దిగజారుతుందన్న నేపథ్యంలో కాంగ్రెస్ , ఇతర పక్షాల ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని ఆలోచనతో తమ ఉనికిని కాపాడుకునేందుకు తెలంగాణ సెంటిమెంట్​ను ముందుకు తీసుకువచ్చింది. కేంద్రంలో ఉన్న మంత్రులు, ఒక పార్లమెంట్ సభ్యుడు , ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతి జరిగిందని చెబుతుంటే కేంద్ర సంస్థలు అయిన సీబీఐ స్వచ్ఛందంగా ఈ కేసును తీసుకోకూడదా? స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు ప్రభుత్వానికి కొమ్ము కాయాలా..?కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే వెంటనే సీబీఐ ద్వారా ఎంక్వైరీ వేయించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి దమ్ముంటే మోదీ అవినీతి చిట్టా ను బయట పెట్టాలి. కేసీఆర్​ నీ మీద ఏ విధంగా అయితే కేసులు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధాని మోదీ , మంత్రుల పైన అవినీతి కేసులు పెట్టండి.

భయం దేనికి కేసీఆర్ ప్రజలకు అన్నీ తెలుస్తాయి.. మీ నాటకాలను కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛందంగా ప్రజల ముందు ఉంచుతుంది. ఒక ముఖ్యమంత్రి కేంద్రంలో ఉన్న మంత్రులు బహిరంగంగా ప్రకటనలు చేస్తుంటే సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకుని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నేను రెండు మూడు రోజుల్లో రాష్ట్రపతికి సుప్రీంకోర్టుకు లేఖలు రాస్తాను. ఈ రకమైన కార్యక్రమాలను దేశంలో ఎన్నికల కోసం , ప్రజల్ని మోసం చేయడం కోసం అధికారం కోసం చేస్తున్నారు.

గతంలో కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు వస్తే కాంగ్రెస్ ఏ విధంగా ఎంక్వైరీలు వేసిందో తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రులు పైన కూడా కేసులు పెట్టలేదా ? ఆరోపణలన్నీ కొట్టివేయ బడలేదా ?


కేసీఆర్​ గారు ఇక మీ డ్రామాలు కట్టిపెట్టండి రోజులు దగ్గర పడ్డాయి .. బీజేపీ ప్రభుత్వ కేంద్ర మంత్రులు మోదీ గారు ఇప్పటివరకు చేసింది చాలు ..అవినీతిని అరికట్టడానికి చేసే ప్రయత్నంలో మీ ధర్మ కర్తవ్యాన్ని ఆచరిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలి. ”అని డిమాండ్​ చేశారు.

First published:

Tags: Ponnala, TS Congress

ఉత్తమ కథలు