ఎవరైనా పెద్ద పదవి ఇస్తామంటే నేతలు సంతోషంతో స్వీకరిస్తారు. కానీ ఆ నాయకుడి పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నం. జాతీయ పార్టీకి సారథి బాధ్యతలు తీసుకోవాలని ఆ పార్టీ ముఖ్యనేతలు ఎంతగా సర్దిచెబుతున్నా.. ఆయనకు మాత్రం మనసు రావడం లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ (Rajasthan) ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇలాంటి వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. త్వరలో జరగబోయే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో అశోక్ గెహ్లాట్‌ను(Ashok Gehlot) బరిలోకి దింపాలని సోనియాగాంధీ (Sonia Gandhi) భావిస్తున్నారు. పోటీలో ఉండాల్సింది మీరే అంటూ ఆయనకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. కానీ ఆయన మాత్రం రాహుల్ గాంధీనే కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలంటూ చెబుతున్నారు. ఇందుకోసం పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ దగ్గరకు వెళ్లి ఆయనను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే కాంగ్రెస్ అధ్యక్ష పదవి వద్దని అశోక్ గెహ్లాట్ అనుకోవడానికి మరో బలమైన కారణం ఉంది. అదే రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవి. ఒకవేళ ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటే రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన తప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. రాజస్థాన్ కాంగ్రెస్ కీలకమైన నాయకుడు సచిన్ పైలెట్ సీఎం పదవిపై ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్నారు. గెహ్లాట్ కాంగ్రెస్ చీఫ్ అయితే.. ఆయన సీఎం పదవి నుంచి తప్పుకోవాలని మొదటగా డిమాండ్ చేసేది కూడా సచిన్ పైలెటే. ఈ విషయం అశోక్ గెహ్లాట్‌కు తెలియనిది కాదు.
తాను ఈ రెండు పదవులను నిర్వహిస్తానని రాజస్థాన్‌లోని తన వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆయన చెబుతున్నా.. ఒక్కసారి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత పరిస్థితులు మారే అవకాశం ఉంటుంది. ఈ విషయం గెహ్లాట్‌కు కూడా బాగా తెలుసు. అందుకే తాను అధ్యక్ష రేసులో ఉండబోనని.. ఇందుకు మరో వ్యక్తిని చూసుకోవాలని ఆయన కాంగ్రెస్ నాయకత్వానికి, మరీ ముఖ్యంగా సోనియాగాంధీకి ఈ మేరకు గెహ్లాట్ విన్నపాలు చేసుకుంటున్నారు.
Congress: ‘కాంగ్రెస్ చీఫ్ రేసులో నేను ఉన్నా.. ’.. దిగ్విజయ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Rahul Gandhi: రాహుల్ గాంధీనే కాంగ్రెస్ చీఫ్ కావాలి.. పలు రాష్ట్రాల కాంగ్రెస్ తీర్మానాలు
ఒకవేళ రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగేందుకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సమ్మతించినా.. సచిన్ పైలెట్, ఆయన వర్గం నేతలు రాజస్థాన్‌లో కొత్త పంచాయతీ పెట్టడం ఖాయమని గెహ్లాట్ భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధ్యక్ష పదవి కంటే తన రాజస్థాన్ సీఎం సీటు తనకు ముఖ్యమని ఆయన భావిస్తున్నారు. కానీ కాంగ్రెస్ కచ్చితంగా ఆయనే అధ్యక్షుడు కావాలని కోరుకుంటే మాత్రం.. రెండు పదవుల్లో కొనసాగే అవకాశం ఉంటేనే అంటూ ఆయన కొత్త కండీషన్ పెట్టే ఛాన్స్ పలువురు చర్చించుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ashok Gehlet, Congress