Home /News /national /

POLITICS CONGRESS PRESIDENT SONIA GANDHI FORMS 3 GROUPS TO CHART ROAD AHEAD FOR PARTY PVN

Task Force 2024 : రాబోయే ఎన్నిల్లో విజయమే లక్ష్యంగా మూడు బృందాలను ఏర్పాటు చేసిన సోనియా

ప్రియాంక, రాహుల్, సోనియా(ఫైల్ ఫోటో)

ప్రియాంక, రాహుల్, సోనియా(ఫైల్ ఫోటో)

Task Force 2024 : సోనియా గాంధీ ప్ర‌క‌టించిన ఈ కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ 2024 రాజకీయ ప్యానెల్ లో కాంగ్రెస్ రెబ‌ల్ లీడ‌ర్స్ తో పాటు ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ మాజీ సహచ‌రుడుకి కూడా ఇందులో చోటుక‌ల్పించారు.

Sonia Gandhi Forms 3 Groups: రానున్న సార్వత్రిక ఎన్నిక‌ల్లో ఎలాగైన విజ‌యం సాధించి కాంగ్రెస్ పార్టీకి గ‌త వైభ‌వాన్ని తీసుకురావాలని యత్నిస్తున్న ఆ పార్టీ అధిష్ఠానం అందుకు అవసరమైన కృషి చేస్తోంది. ఇప్ప‌టి నుంచే ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లు రచిస్తూ ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగా కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ 2024 రాజకీయ ప్యానెల్ ను ప్ర‌క‌టించింది 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధ‌మ‌వ‌డానికి,వివిధ అంశాలపై పార్టీ నేతలు సమాంతరంగా పని చేసేలా మూడు బృందాలను ఏర్పాటు చేశారు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాజకీయ వ్యవహారాలకు ఓ గ్రూప్​, పార్టీ సంస్కరణలపై ఇటీవల చింతన్ ​శిబిర్​లో తీసుకున్న నవసంకల్ప్​' నిర్ణయం అమలుకు ఓ బృందాన్ని​, భారత్​ జోడో యాత్ర బాధ్యతలు మరో బృందానికి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. జీ-23 నేతలు సహా కాంగ్రెస్​ సీనియర్ నేతలు వీటిలో సభ్యులుగా ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ మాజీ అసోసియేట్ సునీల్ కనుగోలు కూడా ఇందులో ఉన్నారు.

పార్టీలో ప్రక్షాళన, 2024 ఎన్నికలే లక్ష్యంగా ఇటీవల రాజస్తాన్ లోని ఉదయ్‌పూర్ లో చింతన్ శిబిర్‌ను నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. మూడు రోజుల ఈ సదస్సులో దేశ ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, సామాజిక న్యాయం, రైతులు, యువతపై చర్చ చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా గ్రూపులను ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రూపులో 60 నుంచి 70 మంది చ‌ర్చించారు. పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలంటే ఏం చేయాలి.. ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించారు. మిషన్ 2024 పేరుతో కాంగ్రెస్ రూపొందిస్తున్న వ్యూహాన్ని ఈ శిబిరం ద్వారా శ్రేణుల్లోకి తీసుకెళ్లాలని భావించారు. అయితే, చింత‌న్ శిబిర్ చ‌ప్ప‌గా సాగింద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ పార్టీ విమ‌ర్శ‌ల‌కు చెక్ పెడుతూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాబోయే ఎన్నిక‌లను దృష్టిలో పెట్టుకొని, టాస్క్‌ఫోర్స్ 2024 ను కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది.

ALSO READ Dawood Ibrahim : ఎట్టకేలకు దొరికిన దావూద్ ఇబ్రహీం ఆచూకీ..కీలక విషయాలు బయటపెట్టిన దావూద్ మేనల్లుడు!

సోనియా గాంధీ ప్ర‌క‌టించిన ఈ కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ 2024 రాజకీయ ప్యానెల్ లో కాంగ్రెస్ రెబ‌ల్ లీడ‌ర్స్ తో పాటు ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ మాజీ సహచ‌రుడుకి కూడా ఇందులో చోటుక‌ల్పించారు.  టాస్క్​ఫోర్స్​-2024 పేరుతో నవసంకల్ప్​ కోసం ఏర్పాటు చేసిన బృందంలో సీనియర్​ నేతలు పి.చిదంబరం, ప్రియాంక గాంధీ వాద్రా సహా ముకుల్​ వాస్నిక్​, జైరామ్​ రమేశ్, కేసీ వేణుగోపాల్, అజయ్​ మేకన్, రణ్​దీప్​ సింగ్​ సుర్జేవాలా, సునీల్​ కనుగోలు సభ్యులుగా ఉన్నారు. టాస్క్‌ఫోర్స్‌లోని ప్రతి సభ్యునికి ఆర్గనైజేషన్, కమ్యూనికేషన్, మీడియా, ఔట్‌రీచ్, ఫైనాన్స్ మరియు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిర్దిష్ట టాస్క్ కేటాయించబడుతుంద‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపార‌యి. వారు నియమించబడిన బృందాలను కలిగి ఉంటారు. ఉదయపూర్ నవ్ సంకల్ప్ డిక్లరేషన్ మరియు ఆరు గ్రూపుల నివేదికలను కూడా టాస్క్ ఫోర్స్ అనుసరిస్తుంది.

ALSO READ Suspicious Pigeon : భారత్ లోకి పాక్ గూఢచారి పావురం..రెక్కలపై కోడ్ భాష!

సోనియా ఆధ్వర్యంలోని పార్టీ వ్యవహారాల బృందంలో రాహుల్​ సహా జీ23 నేతలైన గులామ్​ నబీ ఆజాద్, ఆనంద్​ శర్మ కూడా ఉన్నారు. వీరితో పాటు మల్లికార్జున ఖర్గే, అంబికా సోనీ, దిగ్విజయ సింగ్, కేసీ వేణుగోపాల్, జితేంద్ర సింగ్​ కూడా బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఇక భారత్​ జోడో యాత్ర కోసం ఏర్పాటు చేసిన కేంద్ర ప్రణాళికా బృందంలో.. సచిన్​ పైలట్, దిగ్విజయ సింగ్, శశిథరూర్, రవ్​నీత్​ సింగ్ బిట్టు, కేసీ జార్జ్​, జోతిమణి, ప్రద్యుత్​ బోర్దోలోయ్​, జితు పట్వారీ సహా సలీమ్​ అహ్మద్​ ఉన్నారు. 'భారత్​ జోడో యాత్ర'లో భాగంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్​ వరకు కాంగ్రెస్​ నేతలు పర్యటించనున్నారు. గాంధీ జయంచి సందర్భంగా ఈ యాత్రను ప్రారంభించాలని కాంగ్రెస్​ నిర్ణయించింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Congress, Congress chief, Sonia Gandhi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు