హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Sonia Gandhi: కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. ప్రకటించిన సోనియాగాంధీ.. ఆమె పోటీ నుంచి తప్పుకున్నట్టేనా ?

Sonia Gandhi: కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. ప్రకటించిన సోనియాగాంధీ.. ఆమె పోటీ నుంచి తప్పుకున్నట్టేనా ?

సోనియా గాంధీ (ఫైల్ ఫోటో)

సోనియా గాంధీ (ఫైల్ ఫోటో)

Sonia Gandhi: ప్రజల సంక్షేమం, అభివృద్ధికి దోహదపడేలా తయారు చేసిన ప్రభుత్వ సంస్థలు అమ్ముడుపోతున్నాయని సోనియాగాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారిందని సోనియా గాంధీ విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కుటుంబంలో ఒకరికే పోటీ చేసే అవకాశం కల్పిస్తామని పేర్కొంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల పాటు జరగనున్న చింతిన్ శివిర్ కార్యక్రమంలో భాగంగా సోనియాగాంధీ(Sonia Gandhi) ఈ ప్రకటన చేశారు. కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత స్వార్ఘం వీడాలని ఆమె సూచించారు. కాంగ్రెస్‌లో తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి స్వేచ్ఛ ఉందని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. కానీ మనమంతా ఒక్కటిగానే ఉన్నామనే సందేశం ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ప్రారంభోపన్యాసంలో సోనియా గాంధీ క్రమశిక్షణ లక్ష్మణ రేఖను గీస్తూ పార్టీ నేతలు.. పార్టీ రుణం తీర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ (Congress) మనందరికీ ఎంతో ఇచ్చిందని, ఇప్పుడు ఆ రుణం తీర్చుకునే వంతు వచ్చిందని మరోసారి గుర్తు చేశారు. ఇక్కడ నుంచి వెళ్లాక కొత్త శక్తి, కొత్త నిబద్ధత, స్ఫూర్తితో వెళ్లిపోతామని సోనియా గాంధీ అన్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్‌పై మరోసారి భారీ అంచనాలు పెట్టుకున్నారని, వాటిని నెరవేర్చేలా చేసి చూపాలని సూచించారు

ఈ సందర్భంగా సోనియా గాంధీ మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేడు దేశవ్యాప్తంగా మైనార్టీలు తీవ్ర వివక్షకు గురవుతున్నారని అన్నారు. వారు కూడా సమాన పౌరులని, వారికి కూడా సమాన హక్కులు ఉన్నాయని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు అణచివేతకు గురవుతున్నారని.. దళితులను శిక్షింపబడుతున్నారని ఆరోపించారు. మోదీ ప్రభుత్వ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, నోట్ల రద్దు నాటి నుంచి నిరంతర పతనావస్థ కొనసాగుతోందని సోనియా గాంధీ విమర్శించారు.

ఇప్పుడు మనకు ఉద్యోగాలు రావడం లేదని ప్రజలు భావించారని అన్నారు. ప్రైవేటీకరణ విధానాన్ని ప్రశ్నించిన సోనియా గాంధీ.. కొత్త ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని ఆరోపించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి దోహదపడేలా తయారు చేసిన ప్రభుత్వ సంస్థలు అమ్ముడుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారిందని సోనియా గాంధీ విమర్శించారు.

Congress Chintan Shivir: ఉదయపూర్‌లో కాంగ్రెస్ మేధోమథనం షురూ.. 3రోజుల సదస్సులో ముఖ్య నిర్ణయాలు

PM Modi: రెండో గ్లోబల్ కోవిడ్ సమ్మిట్.. ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించిన కీలక అంశాలు..

ప్రజలు పెద్ద ఎత్తున నిరుద్యోగులుగా మారారని.. వారు కేవలం యుపిఎ ప్రభుత్వ పథకాల ద్వారా మాత్రమే రక్షించబడ్డారని అన్నారు. ఉపాధి హామీ పథకం, ఆహార భద్రతా చట్టం అనే రెండు పథకాలకు తాను ప్రత్యేకంగా తీసుకురావాలని అనుకున్నానని అన్నారు. నేడు దేశం భిన్నమైన పరిస్థితుల్లో ఉందని… మహాత్మా గాంధీ హంతకులను కీర్తిస్తున్నారని అన్నారు. నేడు రాజ్యాంగ సంస్థల ముందు పెను ప్రమాదం పొంచి ఉందని ఆరోపించారు.

First published:

Tags: Congress, Sonia Gandhi

ఉత్తమ కథలు