హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Ashok Gelhot : రాజస్తాన్ ఎఫెక్ట్..కాంగ్రెస్ అధ్యక్ష రేస్ నుంచి గెహ్లాట్ ఔట్

Ashok Gelhot : రాజస్తాన్ ఎఫెక్ట్..కాంగ్రెస్ అధ్యక్ష రేస్ నుంచి గెహ్లాట్ ఔట్

అశోక్ గెహ్లాట్ (ఫైల్)

అశోక్ గెహ్లాట్ (ఫైల్)

Congress president election : అక్టోబర్‌ 17వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నిర్వహిస్తున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు రాజస్తాన్ ముఖ్యమంత్రి(Rajasthan CM)అశోక్ గెహ్లాట్(Ashok Gehlot)గత వారం ప్రకటించిన విషయం తెలిసిందే.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Congress president election : అక్టోబర్‌ 17వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నిర్వహిస్తున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు రాజస్తాన్ ముఖ్యమంత్రి(Rajasthan CM)అశోక్ గెహ్లాట్(Ashok Gehlot)గత వారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అశోక్ గెహ్లాట్ ప్రకటన తర్వాత రాజస్తాన్ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకోవాలని అశోక్ గెహ్లాట్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. రాహుల్ గాంధీ "భారత్ జోడో యాత్ర" కొనసాగుతున్న సమయంలో పార్టీని ఇబ్బంది పెట్టే తిరుగుబాటుకు కుట్ర పన్నినందుకు అశోక్ గెహ్లాట్ పట్ల కాంగ్రెస్ అగ్ర నాయకత్వం అసంతృప్తిగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో అశోక్ గెహ్లాట్..పార్టీ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నారని తెలిపాయి. మల్లికార్జున్ ఖర్గే లేదా దిగ్విజయ్ సింగ్‌ లలో ఒకరు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారని సమాచారం. పోటీకి సిద్ధమైన మరో సీనియర్ నేత శశిథరూర్‌ ఈ 30న.. తన నామినేషన్‌ పత్రాలను సమర్పించనున్నారు.

కాంగ్రెస్​ పార్టీ కొన్ని నెలల క్రితం ఉదయ్​పుర్ డిక్లరేషన్​లో ఒక వ్యక్తి- ఒకే పదవి((One man-One post)లో ఉండాలని తీర్మానించింది. "ఒక వ్యక్తి, ఒకపదవి" అనే నియమాన్ని కాంగ్రెస్ అనుసరిస్తుందని ఇటీవల రాహుల్ గాంధీ స్పష్టం చేయడంతో గెహ్లాట్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తన జాతీయ పాత్రకు వెళ్లడానికి గత వారం అంగీకరించారు. కేరళలో భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని గత వారం కలిసిన అనంరం కొచ్చిలో విలేఖరులతో గెహ్లాట్ మాట్లాడుతూ తాను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే రాజస్తాన్ సీఎం పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. అయితే ఆదివారం రాజస్తాన్ లో పరిణామాలు వేగంగా మారిపోయాయి. గెహ్లాట్ కి వన్ మ్యాన్-వన్ పోస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని,లేదు సీఎంని మార్చాలనుకుంటే 2020లో సచిన్ పైలట్ తో కలిసి తిరుగుబాటు చేసిన 18మంది ఎమ్మెల్యేలలను కాకుండా గెహ్లాట్ వర్గంలోని ఒకరిని సీఎం చేయాలన్న డిమాండ్ డిమాండ్ తో గెహ్లాట్ వర్గానికి చెందిన 90కి పైగా ఎమ్మెల్యేలు స్పీకర్ ని కలిసి తమ రాజీనామా లేఖలు సమర్పించారు. దీంతో. పర్యవేక్షణ కోసం రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి అజయ్‌ మాకెన్‌, ఏఐసీసీ పరిశీలకుడు మల్లికార్జున్‌ ఖర్గే జైపూర్‌ చేరుకున్నారు. ఎమ్మెల్యేలను విడివిడిగా కలిసి వారితో మాట్లాడేందుకు ఢిల్లీ నుంచి జైపూర్ కి వచ్చిన మల్లిఖార్జున ఖర్గే,అజయ్ మాకెన్ లను కూడా ఎమ్మెల్యేలు కలవలేదు. దీంతో వారు వెంటనే ఢిల్లీకి తిరుగుయనమ్యారు. ఈ క్రమంలో రాజస్తాన్ పరిణామాల పట్ల హైకమాండ్ సీరియస్ అయింది. గెహ్లాట్..రాజస్తాన్ పరిణామాలకు అధిష్ఘానినికి క్షమాపణ చెప్పినప్పటికీ...ఆయనే ఎమ్మెల్యేలను అధిష్ఠానంపైకి ఉసిగొల్పి తిరుగుబాటు చేయించాడని గాంధీ ప్యామిలీ భావించింది. ఆయన్ను అధ్యక్షుడిని చేస్తే పార్టీ శ్రేణులకు, నేతలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని వారు భావిస్తున్నట్లు సమాచారం.

Ostracised in death : తక్కువ కులం డాక్టర్ పోస్టుమార్టం చేశాడని..శవాన్ని వెలేసిన గ్రామం!

అత్యంత విశ్వాసపాత్రుడిగా తమ మన్ననలను అందుకుని అధ్యక్ష రేసులో నిలిచిన గహ్లోత్‌ ఈ స్థాయిలో తిరుగుబాటు చేస్తారని సోనియా, రాహుల్‌ ఊహించనేలేదు. ఓపక్క భారత్‌ జోడో యాత్ర విజయవంతంగా నడుస్తోందని,కాంగ్రెస్‌ కార్యకర్తల్లో పునరుత్తేజం కలిగిస్తోందని,ఇలాంటి పరిస్థితుల్లో మొన్న గోవాలో 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారని.. ఇప్పుడు కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా తాము ఎంపిక చేయాలనుకున్న నాయకుడే ధిక్కార వైఖరి అవలంబించడంపై వారు ఆగ్రహంతో ఉన్నారని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Ashok Gehlet, Congress President Elections, Rajasthan

ఉత్తమ కథలు