Congress first list for karnataka elections : కర్ణాటక రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా..ఎలాగైనా గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి జాబితాను పార్టీ అధిష్టానం ఇవాళ తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా విడుదల చేసింది. తొలి జాబితా ద్వారా మొత్తం 124 మందికి తొలి జాబితాలో టికెట్ కేటాయించారు. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపుర నుంచి పోటీ చేయనున్నారు. డీకే శివకుమార్ ఇప్పటికే కనకపుర సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
మరోవైపు, వరుణ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు టికెట్ దక్కింది. అయితే కోలార్ నుంచి పోటీ చేయాలనుకున్న సిద్ధరామయ్యకు.. తన కుమారుడి స్థానం నుంచి టికెట్ దక్కించుకున్నారు. వరుణకు ప్రస్తుతం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు సిద్ధరామయ్య ప్రస్తుతం రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలోని బాగల్‌కోట్ జిల్లాలోని బాదామి సెగ్మెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.2018 ఎన్నికలలో రెండు చోట్ల పోటీచేసిన సిద్దరామయ్య.. బాగల్‌కోట్‌లోని బాదామి నుంచి గెలిచినప్పటికీ మైసూరులోని చాముండేశ్వరి నుంచి ఓడిపోయారు.
Congress party announces the first list of 124 candidates for Karnataka Assembly Elections. Names of former CM Siddaramaiah, and State party president DK Shivakumar are present in the first list. pic.twitter.com/TC9vXJfrX5
— ANI (@ANI) March 25, 2023
Trending: 55వేల ఏళ్లనాటి ఉల్కతో పర్స్..మీరు కూడా ఆన్ లైన్ లో ఆర్డర్ చేయొచ్చు!
కొరటగెరె నియోజకవర్గం నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వరను పార్టీ బరిలోకి దింపింది. దేవనహళ్లి నుంచి మాజీ మంత్రులు కేహెచ్ మునియప్ప, చితాపూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే పోటీ చేయనున్నారు. పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటరమణప్పను పక్కనపెట్టి కొత్త అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది.బీజేపీని వీడిన ఎమ్మెల్సీ పుట్టన్న రాజాజీనగర్ నుంచి టికెట్ పొందగా, దేవనహళ్లి నుంచి కేంద్ర మాజీ మంత్రి కేహెచ్ మునియప్ప పోటీ చేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Karnataka, Karnataka Elections, Karnataka Politics, Siddaramaiah