పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కూడా వాడివేడిగా సాగనున్నాయి. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై విపక్షాలు సోమవారం చర్చించాయి. ఈ భేటీలో అవిశ్వాసం కూడా చర్చకు వచ్చింది. గత పార్లమెంట్ సమావేశాల్లో అన్నాడీఎంకేను అడ్డుపెట్టుకుని తప్పించుకున్న మోడీ ప్రభుత్వాన్ని ఈ సమావేశాల్లో వదలకూడదని నిర్ణయించాయి. దీంతో సభలో అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించాయి. దీనికి 12 పార్టీలు మద్దతు తెలిపినట్టు ఖర్గే చెప్పారు.
మరోవైపు రాజ్యసభలో కూడా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని పెద్దల సభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. ఈవీఎంలపై ప్రజల్లో నమ్మకం పోతోందని, మళ్లీ బ్యాలెట్ పేపర్ తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యసభ, లోక్ సభ టీవీలను నియంత్రించేందుకు కుట్ర జరుగుతోందని ఆజాద్ ఆరోపించారు. దీనిపై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు. తాము అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పకపోతే సభలో జరిగే ఆటంకానికి సర్కారే జవాబుదారీ అవుతుందని హెచ్చరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Mallikarjun Kharge, Monsoon session Parliament, Narendra modi, Rajya Sabha